Platinum: బాబోయ్ అనిపిస్తున్న బంగారం.. గోల్డ్ ఎందుకు? ఇది చాలు అంటున్న యువత!

బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజు రోజుకూ పైకి ఎగసిపడుతున్నాయి. దీంతో ఈ పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కోసం ప్రత్యామ్నాయంగా ప్లాటినం వైపు యువత చూస్తోంది. ప్లాటినం నగల వ్యాపారం ఈ సీజన్ లో 25 శాతం పెరగడం కొత్త ట్రెండ్ ను సూచిస్తోంది. 

New Update
Platinum: బాబోయ్ అనిపిస్తున్న బంగారం.. గోల్డ్ ఎందుకు? ఇది చాలు అంటున్న యువత!

Platinum: దేశంలో పెళ్లిళ్ల సీజన్ జోరుగానే ఉంది.. భారతీయ వివాహాల్లో ఆనవాయితీగా అబ్బాయి, అమ్మాయిలకు కుటుంబ సభ్యులు నగలను బహుమతిగా ఇస్తారు. కానీ ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో బంగారం కొనడం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో  చాలా మంది వరులు బంగారానికి బదులు ప్లాటినంను ఇష్టపడుతున్నారు. భారతీయ వధువుల్లో ప్లాటినం ఆభరణాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. అదే సమయంలో, ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ప్లాటినం ప్రస్తుతం 10 గ్రాములకు రూ .25,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అసలు భారతీయ వధూవరుల్లో ప్లాటినంకు డిమాండ్ పెరగడానికి కారణం ఏంటో తెలుసుకుందాం...

నిపుణులు చెబుతున్నదాని  ప్రకారం, మనదేశంలో పురుషులు ఇప్పుడు భారీ బంగారు గొలుసులు ధరించడానికి వెనుకాడుతున్నారు. హెవీ గోల్డ్ చైన్ల ట్రెండ్ ఇప్పుడు మారుతోంది. అందువల్ల  ప్రజలు మంచి డిజైన్లతో సన్నని ప్లాటినం(Platinum) గొలుసుల కోసం చూస్తున్నారు. ఈ పండుగ, పెళ్లిళ్ల సీజన్లో పురుషుల ప్లాటినం ఆభరణాల విభాగం 25-30 శాతం పెరిగింది. అదే సమయంలో, తన అమ్మకాలను మరింత పెంచడానికి, ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ పురుషుల ప్లాటినం ఆభరణాల బ్రాండ్ అంబాసిడర్ గా క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ తో ప్రచారం కూడా చేస్తోంది. ఇది యువకులను ఆకర్షిస్తోంది. 

బంగారం కంటే ప్లాటినం చౌక

నేటి యువత బంగారం అనేదానిని ఆభరణాలుగా ధరించే విధానంగా కాకుండా.. మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా భావిస్తున్నారు. అందుకే గోల్డ్ బాండ్స్ వంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్లాటినం(Platinum) ఆభరణాల మేకింగ్ చార్జీ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ప్లాటినం ముక్క బంగారం కంటే చౌకగా ఉంటుంది. అందుకే బంగారానికి బదులు ప్లాటినం కొనడం మంచిదని ప్రజలు భావిస్తున్నారాని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Also Read: ఇల్లు కొంటున్నారా? ఈ ఐదు విషయాలు జాగ్రత్తగా చెక్ చేసుకోండి..  

వీటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు.. 

ప్లాటినం(Platinum) బ్రాస్ లెట్ లు - గొలుసులు పెద్ద నగరాల వెలుపల భారతీయ యువతలో బాగా ప్రాచుర్యం పొందాయి. వీటి ధర రూ.2 లక్షల లోపు ఉంటుంది. అందువల్ల, వారు షాపింగ్ చేసేటప్పుడు పాన్ కార్డును చూపించాల్సిన అవసరం లేదు. రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువ చేసే ఏదైనా కొనుగోలు చేయడానికి పాన్ కార్డు అవసరం.

ఈ పండుగ సీజన్లో 25 శాతం పెరుగుదల

నేటి యువతరం ప్లాటినం(Platinum) డిజైన్లకే ప్రాధాన్యం ఇస్తోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం యువతలో ఒక నిర్దిష్ట వర్గం ఎప్పుడూ బంగారం వెలుగుల వైపు మాత్రమే చూడరు. అన్నిసార్లు బంగారం వారిపై పెద్దగా ప్రభావం చూపించదు.  ఈ పెళ్లిళ్లు, పండుగల సీజన్లో బంగారంతో పోలిస్తే ప్లాటినం ఆభరణాల కొనుగోళ్లు 25 శాతం పెరిగాయి.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు