Gold Rate Today : గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్ రేట్ ఎంతంటే.. 

బంగారం ఈరోజు (డిసెంబర్ 25) స్థిరంగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,200ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,490ల వద్ద మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక వెండి కూడా కేజీకి రూ.80,500ల వద్ద స్థిరంగా ఉంది.

Gold Rate: రిలాక్స్.. బడ్జెట్ వేళ స్థిరంగా బంగారం ధరలు.. 
New Update

Gold Rate Today : బంగారం ధరలు(Gold Rates) ఈ మధ్యకాలంలో పైకీ కిందికీ కదులుతూ వస్తున్నాయి. ఈనెలలో బంగారం ధర చాలా అస్థిరంగా ఉంది.   నిన్న అంటే 24వ తేదీ  బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఆంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరల్లో మార్పు లేకపోవడంతో దేశీయంగాను బంగారం ధరలు స్థిరంగా నిలిచాయి. మరోవైపు వెండి ధరలు కూడా నిన్నటి ధరల వద్దే మార్పులు లేకుండా నిలిచాయి. ఈరోజు అంటే సోమవారం(డిసెంబర్ 25) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) ఎటువంటి మార్పు లేకుండా రూ.58,200ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం కూడా స్థిరంగా నిలిచింది. నిన్నటి ధర రూ. 63,490ల వద్ద మార్పులు లేకుండా ఉంది.  అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి.  ఇక్కడ 22 క్యారెట్ల బంగారం రూ.58,350ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) కూడా నిన్నటి ధర రూ.63,640ల వద్ద స్థిరంగా ఉంది. 

ఇక వెండి ధరలు(Silver Rates) కూడా స్థిరంగానే ఉన్నాయి.  హైదరాబాద్(Hyderabad) లో వెండి కేజీకి మార్పులు లేకుండా  రూ.80,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ లోనూ వెండి రేటు ఎటువంటి మార్పులు లేకుండా పెరిగి రూ.79,000ల వద్ద ఉంది. 

Also Read: షాకిస్తున్న బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు తులం ఎంతంటే?

అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు(Gold Rate Today) ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rate Today)  2053 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర ఔన్స్ 24.21 డాలర్లుగా ఉంది. మొత్తమ్మీద చూస్తే ఈరోజు బంగారం వెండి ధరల్లో మార్పులు లేవు. 

గమనిక: బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. 

Watch this interesting Video:

#gold-rates #silver-rates-today
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe