Gold Rate Today: షాకిచ్చిన బంగారం-వెండి ధరలు.. ఎంత పెరిగాయంటే.. వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,100ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,290ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 1000 పెరిగి రూ.77,000 వద్ద ఉంది. By KVD Varma 17 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Gold Rate Today: బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వచ్చి అందరిలోనూ ఆశలు రేపాయి. దీంతో బంగారం కొనాలని అనుకునేవారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, వారి ఆశలను చెరిపేస్తూ ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు నిన్న పెరుగుదల కనపరిచాయి. దీంతో ఆ ప్రభావం ఈరోజు దేశీయంగానూ కనిపించింది. ఈ వారం అంతా దాదాపుగా తగ్గుతూనే వచ్చిన బంగారం ధరలు వారం చివరలో షాక్ ఇచ్చాయి. ఈరోజు అంటే ఫిబ్రవరి 17న బంగారం పెరుగుదల కనబరిచింది. బంగారం ధరల(Gold Rate Today) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం .. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం డిమాండ్ పెరుగుతూ ఉండడం బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే ఫిబ్రవరి 17న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold Rate Today)స్వల్పంగా పెరిగింది. దీంతో దేశీయంగాను బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు వరుసగా రెండోరోజూ భారీగా పెరిగాయి. ఈరోజు అంటే శనివారం (ఫిబ్రవరి 17) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold Rate Today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో బంగారం ధరలు.. హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు బంగారం ధరలు కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) 200 రూపాయలు పెరిగింది. దీంతో రూ.57,100ల వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు220 రూపాయలు పెరిగి రూ. 62,290ల కు చేరుకుంది. ఢిల్లీలో బంగారం ధరలు ఇలా.. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate Today) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) 200 రూపాయలు పెరిగి 10 గ్రాములకు రూ.57,250ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220రూపాయలు పెరుగుదల కనబరిచి రూ.62,440ల వద్దకు చేరుకుంది. Also Read : ఛాన్స్ మిస్ కావద్దు.. బంగారం ధరలు చౌకగానే.. వెండి పెరిగింది.. ఎంతంటే.. వెండి ధరలు ఇలా.. ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Rate Today) పెరుగుదల నమోదు చేస్తుంటే వెండి ధరలు వరుసగా రెండో రోజూ పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 1000 రూపాయలు పెరిగి రూ.77,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 1100 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 75,600 లకు చేరుకుంది. అంతర్జాతీయంగా.. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Today Gold Price) 2013డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 23.43 డాలర్లుగా ఉంది. గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. Watch this Interesting Video: #gold-rate-in-hyderabad #gold-rate-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి