Gold Rate: బంగారం.. ఈ మధ్యకాలంలో వరుసగా తగ్గుతూ వచ్చి అందరికీ రిలీఫ్ ఇచ్చింది. ఫర్వాలేదు అనుకునే లోపే మళ్ళీ పరుగులు మొదలు పెట్టాయి బంగారం ధరలు. బంగారం కొనాలనుకునే వారిని నిరాశలో ముంచేస్తూ వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు(Gold Rate) పెరిగాయి. ధరలు తగ్గడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతూ వచ్చాయి. దీంతో డిమాండ్ కూడా పెరిగింది. మరోపక్క అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పైకి కదులుతున్నాయి. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలపై ఆ ప్రభావం కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు వరుసగా పదిరోజుల పాటు కిందికి దిగుతూ వచ్చిన విషయం తెలిసిందే. శనివారం బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. స్వల్పంగా బంగారం ధరలు పైకెగశాయి. మళ్ళీ బంగారం ధరలు పెరుగుతాయేమో అనుకున్న పసిడి ప్రియుల భయాన్ని నిజం చేస్తూ ఈరోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి. బంగారం ధరల(Today Gold Rate)తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే జనవరి 14 న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold Rate)స్వల్పంగా పెరిగింది. దీంతో దేశీయంగాను బంగారం ధరలు(Today Gold Rate) పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వరుసగా తగ్గుతూ వస్తున్న వెండి ధరలు కూడా ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు అంటే ఆదివారం (జనవరి 14) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు:
హైదరాబాద్(Hyderabad) లో వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate) 330 రూపాయలు పెరిగింది. దీంతో రూ.58,000ల వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 320 రూపాయలు పెరిగి రూ. 63,270ల కు చేరుకుంది. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(TGold Rate) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర(Gold Rate) 300 రూపాయలు పెరిగి 10 గ్రాములకు రూ.58,150ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 320 రూపాయలు రూ.63,420ల వద్దకు చేరుకుంది.
Also Read: పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు.. ఈరోజు రేట్ ఇదే
వెండి ధరలు ఇలా:
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Rate) పెరుగుదల నమోదు చేస్తే.. వెండి ధరలు కూడా ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 500 రూపాయలు పెరిగి రూ.78,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 500 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,500 లకు చేరుకుంది.
అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Today Gold Rate) 2049.65డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 23.21 డాలర్లుగా ఉంది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.
Watch this interesting Video: