Gold Rate Today : అమ్మో! బంగారం.. మళ్ళీ పెరుగుతోంది.. వెండి తగ్గనంటోంది 

వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి.  హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,270ల వద్దకు చేరాయి.  ఇక వెండి ధర కేజీకి 300 పెరిగి రూ.78,000 వద్ద ఉంది.

Gold Price: హమ్మయ్య.. గోల్డ్ లవర్స్ కి గుడ్‌న్యూస్..బంగారం ధరలు తగ్గాయ్!
New Update

Gold & Silver Rates : బంగారం ధరలు వరుసగా రెండురోజులుస్థిరంగా ఉండి ఆశలు రేపాయి. దీంతో బంగారం కొనాలని అనుకునేవారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మళ్ళీ వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి.  అంతర్జాతీయంగా బంగారం ధరలు కాస్త పెరుగుదల కనపరిచాయి. దీంతో ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. ముందు వారంలో తగ్గుతూ..పెనుగుతూ కదలాడినా వారాంతానికి స్థిరంగా బంగారం ధరలు నిలిచాయి. కానీ, ఈవారం బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి.  ఈరోజు అంటే జనవరి 31న బంగారం పెరుగుదల కనబరిచింది.  బంగారం ధరల(Gold Rate Today) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం .. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా  ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే జనవరి 31న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold Rate Today)స్వల్పంగా పెరిగింది.  దీంతో  దేశీయంగాను బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు వరుసగా రెండోరోజూ భారీగా పెరిగాయి.  ఈరోజు అంటే బుధవారం (జనవరి 31) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold Rate Today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.            

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు బంగారం ధరలు కాస్త పెరిగాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) 200 రూపాయలు పెరిగింది. దీంతో  రూ.58,000ల వద్దకు చేరింది.  24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు220 రూపాయలు పెరిగి  రూ. 63,270ల కు చేరుకుంది.  

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate Today) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) 200 రూపాయలు పెరిగి 10 గ్రాములకు రూ.58,150ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220రూపాయలు పెరుగుదల కనబరిచి రూ.63,420ల వద్దకు చేరుకుంది. 

Also Read : తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Rate Today) పెరుగుదల నమోదు చేస్తుంటే వెండి ధరలు వరుసగా రెండో రోజూ పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 300 రూపాయలు పెరిగి రూ.78,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 300 రూపాయలు పెరిగింది.  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,500 లకు చేరుకుంది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Today Gold Price)  2035డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 23.11 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this Interesting Video :

#gold-and-silver-price #gold-rates-in-hyderabad #silver-price-in-andhra-pradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe