Gold Rate Today: బంగారం.. సంక్రాంతి రోజు స్టడీగా..వెండి కూడా నిలకడగా.. 

రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,270ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కూడా మార్పు లేకుండా రూ.78,000 వద్ద ఉంది.

Gold Rate Today: మార్పులు లేని బంగారం.. వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే.. 
New Update

Gold Rate Today: రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు సంక్రాంతి రోజు స్థిరంగా నిలిచాయి. ఎటువంటి మార్పులు లేకుండా గోల్డ్ రేట్స్ ఉన్నాయి. దీంతో పసిడి ప్రియులకు కాస్త రిలీఫ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, వరుసగా రెండురోజుల పాటు బంగారం ధరలు పెరగడంతో మరింత పెరుగుతుందని అందరూ భయపడ్డారు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పు లేకపోవడంతో దేశీయంగానో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరల్లో కూడా ఎటువంటి మార్పులు లేవు. ఈరోజు అంటే, సోమవారం (జనవరి 15) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.        

హైదరాబాద్ లో బంగారం ధరలు:     

హైదరాబాద్(Hyderabad) లో వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) ఎటువంటి మార్పు లేకుండా నిన్నటి ధర రూ.58,000ల వద్దనిలిచింది.   24 క్యారెట్ల బంగారం కూడా నిలకడగా  రూ. 63,270ల వద్ద ఉంది. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate Today) కదలిక లేకుండా ఉన్నాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Gold Rate Today) స్థిరంగా రూ.58,150ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంలో ఎటువంటి మార్పూ లేదు. రూ.63,420ల వద్ద కదలిక లేకుండా ఉంది. 

Also Read: పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు.. ఈరోజు రేట్ ఇదే 

వెండి ధరలు ఇలా: 

ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Rate Today) స్థిరంగా ఉంటె,వెండి ధరలు కూడా ఎటువంటి మార్పు లేకుండా అలానే ఉన్నాయి.  హైదరాబాద్ లో వెండి స్థిరంగా  రూ.78,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు మార్పులు లేకుండా  కేజీ వెండి ధర రూ. 76,500 ల వద్ద నిలిచింది. 

అంతర్జాతీయంగా.. 

మరోవైపు అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పెద్దగా మారలేదు.  ఈరోజు ఔన్స్ బంగారం(Today Gold Rate)  2049.65డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 23.21 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this interesting Video:

#gold-price #silver-price
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe