Gold Rate Today: బంగారమా మజాకా.. తగ్గింది.. ఎంతంటే! పైకెగసిన వెండి ధరలు!! వరుసగా రెండురోజులుగా మార్పులు లేకుండా ఉన్న బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,940, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,00 గా ఉంది. ఇక కేజీ వెండి ₹ 93,500 గా ఉంది. By KVD Varma 28 Aug 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Gold Rate Today: ఈవారంలో వరుసగా రెండురోజుల పాటు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. ఆగండి.. ఆగండి తగ్గాయి అంటే అబ్బో అని ఆశపడకండి. తగ్గాయి అనే పేరుకు మాత్రమే తగ్గాయి. 10 గ్రాముల బంగారం కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు నిన్న కాస్త తగ్గినట్టు కనిపించడంతో మన దేశంలోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది . ఇక వెండి విషయానికి వస్తే నిన్న కాస్త తగ్గిన వెండి ధరలు ఈరోజు షాకిచ్చాయనే చెప్పాలి. ఈరోజు వెండి ధరలు భారీగా పెరిగాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే ఆగస్టు 28న బంగారం ధరలు స్వల్ప మార్పులతో ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు అంతా అదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని కొద్దిగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి 22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,940 24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,030 ఇక విజయవాడ , విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి . ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి . 22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,940 24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,030 దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి . ఈరోజు ఎటువంటి మార్పులు లేకుండా కింది విధంగా బంగారం రేట్లు కొనసాగుతున్నాయి . 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 67,090 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 73,180 బంగారం ధరలు స్థిరంగా ఉంటే . . మరోవైపు ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు నిన్న ఊరట కల్పించినా మళ్ళీ పెరుగుదల బాట పట్టాయి. ఈరోజు వెండి ధరలు బాగానే పెరిగాయి. హైదరాబాద్ లోనూ , ఢిల్లీలోనూ కూడా కేజీకి 600 రూపాయల పెరుగుదల కనిపించింది . హైదరాబాద్ లో వెండి ధర కేజీకి.. ₹ 93,500 గానూ , ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 88,500 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి . ఇక అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు అంటే ఆగస్టు 28 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,525 డాలర్ల వద్ద ఉన్నాయి . అలాగే వెండి ధరలు కూడా పెరుగుదలతో కేజీకి 965 డాలర్లకు పైన ట్రేడ్అవుతున్నాయి. #gold-rate-today #silver-price #gold-price-down మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి