Gold Rate Today: ఛాన్స్ మిస్ కావద్దు.. బంగారం ధరలు చౌకగానే.. వెండి పెరిగింది.. ఎంతంటే.. బంగారం ధరలు ఈరోజూ తగ్గాయి . హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,900ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,070ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.500 పెరిగి రూ.76,000 వద్ద ఉంది. By KVD Varma 16 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Gold Rate Today: ఎప్పుడూ లేనివిధంగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న భారీగా 600 రూపాయల వరకూ తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేసినప్పటికీ.. దేశీయంగా బంగారం ధరలు తగ్గడం గమనార్హం. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ పీక్స్ లో ఉంది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుతుండడంతో బంగారం కొనడానికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. బంగారం, వెండి ధరలు(Gold Rate Today) నిలకడగా ఉండేవి కావు.. అలానే ఇంకా తగ్గుతాయి అని కచ్చితంగా చెప్పేలా కూడా ఉండవు. ప్రస్తుతం అయితే, బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కాస్త పెరుగుదల ఉన్నప్పటికీ.. స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరలు తగ్గుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold Rate Today) ఇటీవలి కాలంలో ఇంత తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. మరోవైపు వెండి ధరలు మాత్రం ఈరోజు కాస్త పెరుగుదల కనబరిచాయి. ఈరోజు అంటే శుక్రవారం (ఫిబ్రవరి 16) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో బంగారం ధరలు.. హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు కొద్దిగా (Gold Rate Today) తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) 100 రూపాయలు తగ్గి రూ.56,900ల వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 110రూపాయలు తగ్గింది. దీంతో రూ. 62,070లకు దిగివచ్చింది. ఢిల్లీ లో ఇలా.. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price Drop) 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గి రూ.57,050ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 10 గ్రాములకు 90 రూపాయలు తగ్గింది. దీంతో రూ.62,200ల వద్ద కు చేరింది. Also Read: ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం తీర్పు.. అసలు ఈ బాండ్స్ ఏమిటి? వెండి ధరలు ఇలా.. ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Price Drop) తగ్గుదల కనపరుస్తుంటే మరోవైపు వెండి ధరలు కాస్త పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 500 రూపాయలు పెరిగింది. దీంతో రూ.76,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు కేజీకి 500 రూపాయలు ఎగసింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 74,500లకు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold Rate Today) ఈరోజు కాస్త పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం (Gold Price Today) 2003.50 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.93డాలర్లకు పెరిగింది. గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. Watch this Interesting Video: #gold-rate #gold-and-silver-price మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి