Gold Rate: పెళ్లిళ్ల వేళ బంగారం పైపైకి.. వెండి ధరల మోత.. ఈరోజు ఎంతంటే.. వరుసగా రెండోరోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,200ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,400ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 1000 పెరిగి రూ.78,000 వద్ద ఉంది. By KVD Varma 18 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Gold Rate: ఈనెల మొదటి నుంచీ తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు పసిడి ప్రియులకు ఆశలను రేపాయి. అంతకుముందు తగ్గేదెలే అంటూ రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ఈ నెలలో తగ్గుతూ వచ్చాయి. ఇక బంగారం తగ్గుతుంది అనుకునే లోపే మళ్ళీ పెరుగుదల బాటలో పడింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుదల చూపిస్తున్నాయి. దీంతో ఆ ప్రభావం ఈరోజు దేశీయంగానూ కనిపించింది. ఈ వారం అంతా దాదాపుగా తగ్గుతూనే వచ్చిన బంగారం ధరలు వారం చివరలో షాక్ ఇచ్చాయి. వరుసగా రెండో రోజు ఈరోజు అంటే ఫిబ్రవరి 18న బంగారం పెరుగుదల కనబరిచింది. బంగారం ధరల(Gold Rate) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం .. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం డిమాండ్ పెరుగుతూ ఉండడం బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే ఫిబ్రవరి 18న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold Rate)స్వల్పంగా పెరిగింది. దీంతో దేశీయంగాను బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు వరుసగా మూడో రోజూ భారీగా పెరిగాయి. ఈరోజు అంటే ఆదివారం (ఫిబ్రవరి 18) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold Rate Today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో బంగారం ధరలు.. హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు బంగారం ధరలు కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) 100 రూపాయలు పెరిగింది. దీంతో రూ.57,200ల వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు110 రూపాయలు పెరిగి రూ. 62,400ల కు చేరుకుంది. ఢిల్లీలో బంగారం ధరలు ఇలా.. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) 100 రూపాయలు పెరిగి 10 గ్రాములకు రూ.57,350ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110రూపాయలు పెరుగుదల కనబరిచి రూ.62,550ల వద్దకు చేరుకుంది. Also Read : తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. వెండి ధరలు ఇలా.. ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Rate Today) పెరుగుదల నమోదు చేస్తుంటే వెండి ధరలు వరుసగా రెండో రోజూ పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 1000 రూపాయలు పెరిగి రూ.78,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 900 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,500 లకు చేరుకుంది. అంతర్జాతీయంగా.. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Today Gold Price) 2013డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 23.43 డాలర్లుగా ఉంది. గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. Watch this Interesting Video: #gold #gold-rate-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి