Gold Rate: తగ్గినట్లే తగ్గి పెరిగిన బంగారం.. తగ్గేదేలే అంటున్న వెండి!

రెండురోజులుగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి.  హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్దకు చేరాయి.  ఇక వెండి ధర కేజీకి 500 పెరిగి రూ.78,000 వద్ద ఉంది.

Gold Price in Hyderabad: దిగివస్తున్న బంగారం ధరలు..పెరిగిన వెండి..ఈరోజు ఎంతంటే.. 
New Update

Gold Rate:  బంగారం ధరలు వరుసగా రెండురోజులు తగ్గుతూ వచ్చి ఆశలు రేపాయి. దీంతో బంగారం కొనాలని అనుకునేవారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. రెండురోజుల్లో ఎంత తగ్గిందో అదే స్థాయిలో బంగారం ధాలు పెరిగాయి.  అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా కదలాడుతున్నప్పటికీ, దేశీయంగా పెరిగాయి. అంతకు ముందు వరుసగా నాలుగు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు తరువాత రెండురోజులు అంటే నిన్నటి వరకూ కాస్త తగ్గిన విషయం తెలిసిందే. ఈరోజు అంటే జనవరి 27న బంగారం పెరుగుదల కనబరిచింది.  బంగారం ధరల(Gold and Silver)తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పులు లేకపోవడం.. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా  ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే జనవరి 27న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold Rate)స్వల్పంగా పెరిగింది.  దీంతో  దేశీయంగాను బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు వరుసగా మూడోరోజూ భారీగా పెరిగాయి.  ఈరోజు అంటే శనివారం (జనవరి 27) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold and Silver) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.           

హైదరాబాద్ లో బంగారం ధరలు:
హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు బంగారం ధరలు కాస్త పెరిగాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver) 100 రూపాయలు పెరిగింది. దీంతో  రూ.57,800ల వద్దకు చేరింది.  24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు100 రూపాయలు పెరిగి  రూ. 63,050ల కు చేరుకుంది.   అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate News) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) 100 రూపాయలు పెరిగి 10 గ్రాములకు రూ.57,950ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100రూపాయలు పెరుగుదల కనబరిచి రూ.63,200ల వద్దకు చేరుకుంది. 

Also Read: తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. 

వెండి ధరలు ఇలా:
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold and Silver) పెరుగుదల నమోదు చేస్తుంటే వెండి ధరలు వరుసగా మూడోరోజూ పెరుగుదల నమోదు చేశాయి. ఈ మూడురోజులు కలిపి 1500 రూపాయల వరకూ వెండి ధర పెరిగింది.  హైదరాబాద్ లో వెండి కేజీకి 500 రూపాయలు పెరిగి రూ.78,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 500 రూపాయలు పెరిగింది.  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,500 లకు చేరుకుంది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Today Gold Price)  2023డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.29 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this interesting Video:

#gold-and-silver-price #gold-rate-today
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe