Gold Rate: బంగారం ధరలు వరుసగా రెండురోజులు తగ్గుతూ వచ్చి ఆశలు రేపాయి. దీంతో బంగారం కొనాలని అనుకునేవారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. రెండురోజుల్లో ఎంత తగ్గిందో అదే స్థాయిలో బంగారం ధాలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా కదలాడుతున్నప్పటికీ, దేశీయంగా పెరిగాయి. అంతకు ముందు వరుసగా నాలుగు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు తరువాత రెండురోజులు అంటే నిన్నటి వరకూ కాస్త తగ్గిన విషయం తెలిసిందే. ఈరోజు అంటే జనవరి 27న బంగారం పెరుగుదల కనబరిచింది. బంగారం ధరల(Gold and Silver)తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పులు లేకపోవడం.. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే జనవరి 27న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold Rate)స్వల్పంగా పెరిగింది. దీంతో దేశీయంగాను బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు వరుసగా మూడోరోజూ భారీగా పెరిగాయి. ఈరోజు అంటే శనివారం (జనవరి 27) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold and Silver) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Gold Rate: తగ్గినట్లే తగ్గి పెరిగిన బంగారం.. తగ్గేదేలే అంటున్న వెండి!
రెండురోజులుగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 500 పెరిగి రూ.78,000 వద్ద ఉంది.
Translate this News: