Gold Rate Hike: ఆశలు ఆవిరి.. బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.. ఎంతంటే.. 

రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 200 పెరిగి రూ.58,400ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 220 పెరిగి రూ.63,710ల కు చేరుకున్నాయి.  ఇక వెండి ధర కేజీకి రూ.81,000ల వద్దకు చేరుకుంది.

New Update
Gold and Silver Price: వెండి ధరల మోత.. తగ్గుతున్న బంగారం ధరలు 

Gold Rate Hike: రెండు రోజులపాటు నిలకడగా ఉండి.. భవిష్యత్ లో తగ్గే ఛాన్స్ ఉండనే ఆశలు రేపిన బంగారం మళ్ళీ పెరుగుదల బాట పట్టింది. ఈ నెల మొత్తంలో చూసుకుంటే.. పైకీ కిందికీ కదులుతూ వచ్చి.. రికార్డ్ స్థాయిలోనే బంగారం ధరలు కొనసాగుతున్నాయి. ఈ ధోరణి చూసి భయపడుతున్న బంగారం ప్రియులకు రెండు రోజులు బంగారం ధరలు స్థిరంగా ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ, మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ ఉండడంతో అదే ధోరణిలో దేశీయంగా కూడా మార్కెట్లు కదులుతున్నాయి.  ఈరోజు అంటే డిసెంబర్ 27న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరల్లోపెరుగుదల కనిపించడంతో  దేశీయంగాను బంగారం ధరలు(Gold Rate Hike) పైకెగశాయి. మరోవైపు వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు అంటే బుధవారం (డిసెంబర్ 27) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.   

హైదరాబాద్(Hyderabad) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Hike) 200 రూపాయలు పెరిగింది. దీంతో  రూ.58,400ల వద్ద చేరుకుంది.  24 క్యారెట్ల బంగారం కూడా 220 రూపాయలు పెరిగి రూ. 63,710ల వద్దకు చేరింది.  అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి.  ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు పెరిగి రూ.58,550ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) ధర 220 రూపాయలు పెరిగి  రూ.63,860ల వద్దకు చేరుకుంది. 

ఇక వెండి ధరలు కూడా ఈరోజు మళ్ళీ పెరుగుదల కనబరిచాయి. బంగారం(Gold Rate Hike) ధరలతో పటు వెండి ధరలు కూడా కేజీకి 300 రూపాయలు పెరిగాయి. దీంతో  హైదరాబాద్ లో వెండి కేజీకి  రూ.81,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు కేజీకి 300 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ.79,500లుగా ఉంది.  

Also Read: షాకిస్తున్న బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు తులం ఎంతంటే?

అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు(Gold Rate Hike)ఈరోజు పెరుగుదల కనబరిచాయి. ఔన్సు బంగారం ధర 10 డాలర్ల మేర పెరిగింది. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rate Hike)  2065 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Silver Rate) ఔన్స్ 24.24 డాలర్లుగా కొనసాగుతోంది.  

గమనిక: బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు