Gold Rate Dropped : భలే ఛాన్స్ లే.. ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. 

ఈరోజు హైదరాబాద్ మార్కెట్లు ప్రారంభం అయ్యే సమయానికి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 57,150 రూపాయలుగా ఉంది.  24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 62,350 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కేజీకి 78,000 రూపాయలుగా ఉంది.

Gold Rates Drop: ఇది శుభవార్తే.. బంగారం ధరలు కాస్త తగ్గాయి.. వెండి మాత్రం.. 
New Update

Gold Rate Dropped : బంగారం ధరలు(Gold Rate) పైకీ కిందికీ కదులుతూనే ఉంటాయి. మన దేశంలో బంగారానికి విపరీతమైన డిమాండ్. ధరలు అస్థిరంగా ఉంటాయి. వరుసగా వారం రోజుల పాటు పెరుగుతూ వచ్చే బంగారం ఒక్కసారిగా కిందికి పడిపోవచ్చు. ఒక్కోసారి తగ్గుతూ వస్తున్న బంగారం అకస్మాత్తుగా పైకెగిసిపోవచ్చు. అందుకే బంగారం కొనాలి అనుకున్నపుడు జాగ్రత్తగా ధరల సరళిని తెలుసుకుని కొనే నిర్ణయం తీసుకోవాలి. గత పదిరోజులుగా అంటే డిసెంబర్ 1 నుంచి బంగారం ధరల విధానం చూస్తే ఎంత అస్థిరత ఉంటుందో స్పష్టం అవుతుంది. 

హైదరాబాద్ లో గత పదిరోజుల్లో బంగారం ధరలు ఇలా.. 

  • డిసెంబర్ 1వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 57,700 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 62,950 రూపాయలుగా ఉంది. 
  • డిసెంబర్ 2వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 750 రూపాయలు పెరిగి 58,450 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 810 రూపాయలు పెరిగి 67,360 రూపాయలకు చేరుకుంది.  
  • డిసెంబర్ 3వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు మార్పులు లేకుండా  58,450 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకుస్థిరంగా  67,360 రూపాయల వద్ద ఉంది 
  • డిసెంబర్ 4వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 400 రూపాయలు పెరిగి 58,850 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 440 రూపాయలు పెరిగి 64,200 రూపాయలకు చేరుకుంది.  
  • డిసెంబర్ 5వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1000 రూపాయలు తగ్గి  (Gold Rate Dropped) 57,850 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1110 రూపాయలు తగ్గి  63,110 రూపాయలకు చేరుకుంది.  
  • డిసెంబర్ 6వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 400 రూపాయలు తగ్గి(Gold Rate Dropped)  57,450 రూపాయలుగా ఉంది.  24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 440 రూపాయలు తగ్గి  62,670 రూపాయలకు చేరుకుంది.  
  • డిసెంబర్ 7వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు పెరిగి 57,550 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 110 రూపాయలు పెరిగి 62,780 రూపాయలకు చేరుకుంది.
  • డిసెంబర్ 8వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 150 రూపాయలు పెరిగి 57,770 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 170 రూపాయలు పెరిగి 62,950 రూపాయలకు చేరుకుంది.
  • డిసెంబర్ 9వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 550 రూపాయలు తగ్గి(Gold Rate Dropped) 57,150 రూపాయలుగా ఉంది.  24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 600 రూపాయలు తగ్గి  62,350రూపాయలకు చేరుకుంది.  

Also Read: జొమాటో డెలివరీ బాయ్ 75 కోట్ల కొనుగోళ్లు.. ఎలా చేశాడు?

ఇక డిసెంబర్ 10న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అలాగే డిసెంబర్ 11వ తేదీ అంటే ఈరోజు బంగారం ధరలు మార్కెట్ ప్రారంభం అయ్యే సమయానికి స్థిరంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 57,150 రూపాయలుగా ఉంది.  24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 62,350 రూపాయలుగా ఉంది. మొత్తంగా చూసుకుంటే గత పది రోజుల్లో అంటే డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకూ బంగారం(Gold Rate Dropped) ధరలు 22 క్యారెట్లు 10 గ్రాములు.. 550 రూపాయలు తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 600 రూపాయలు తగ్గింది.

మరోవైపు వెండి ధరలు గత పది రోజుల్లో భారీగా దిగివచ్చాయి. కేజీ వెండి ధర డిసెంబర్ 1న 82,500 రూపాయలు ఉండగా.. 10వ తేదీ నాటికి ఏకంగా 4వేల 500 రూపాయలు పడిపోయి.. 78,000కు దిగివచ్చింది. ఈరోజు మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి అదే ధర వద్ద ట్రేడ్ అవుతోంది. 

Watch this interesting Video:

#dropped #gold-rate-today #gold-silver-price-today
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe