Gold Price : వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు గత రెండు రోజులు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు కాస్త తగ్గి గోల్డ్ లవర్స్ కి ఊరటనిచ్చాయి. స్వల్ప తగ్గుదల నమోదు చేసినా.. బంగారం ప్రియులకు భవిష్యత్ లో మరింత తగ్గే అవకాశం ఉంటుందనే ఆశలు రేకెత్తాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించిన ఉత్సాహం, యూఎస్ ఫెడ్ రేట్లు తగ్గిస్తారనే వార్తల నేపథ్యంలో ఈ నెలలో వరుసగా బంగారం ధరలు పైపైకి ఎగసినట్టు నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈరోజు అంటే మార్చి13న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Price ) భారీగా తగ్గింది. అయితే, దేశీయంగా మాత్రం ఆ ఎఫెక్ట్ పెద్దగా కనిపించలేదు. అత్యంత స్వల్ప తగ్గుదల మాత్రమే కనిపించింది. మరోవైపు వెండి ధరలు మాత్రం మళ్ళీ పెరిగాయి. ఈరోజు అంటే బుధవారం (మార్చి13) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో రెండు రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price) 10 రూపాయలు తగ్గి రూ.60,740ల వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 10 రూపాయలు తగ్గి రూ.66,260లుగా ఉంది.
ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) స్వల్పంగా తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర(Gold Prices) రూ.60,890ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,410లుగా మార్పులు లేకుండా ఉంది.
Also Read : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. బంగారం పరుగులకు బ్రేక్.. కాస్త తగ్గిన వెండి!
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rates Today)తగ్గుదల కనిపిస్తుంటే, వెండి మాత్రం పెరుగుదల బాటలో ఉంది. హైదరాబాద్ లో వెండి కేజీకి 500 రూపాయలు పెరిగి రూ.79,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 600 రూపాయలు పెరిగి రూ. 76,100ల వద్దకు చేరుకుంది.
అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price) 24.96 డాలర్లు తగ్గింది దీంతో 2158.78 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కూడా స్వల్ప తగ్గుదలతో (Gold And Silver Price) ఔన్స్ 24.16డాలర్లుగా ఉంది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.