Gold Price today: తగ్గేదే లే.. అంటున్న బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. ఈరోజు ఎంత అంటే.. 

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం  10 గ్రాములు 400 రూపాయలు పెరిగి రూ.58,850ల వద్ద ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 440 రూపాయలు పెరిగి రూ.64,200ల వద్దకు చేరుకుంది.  వెండి కేజీకి రూ.83,500ల వద్ద ఉంది.

New Update
Gold Price: మురిసినంత సేపు లేదు.. మళ్ళీ బంగారం ధర పెరిగింది.. ఎంతంటే.. 

Gold Price today:  బంగారం ధరలు తగ్గేదే లే.. అంటున్నాయి. గతవారం భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ వారం ప్రారంభంలో పెరుగుదల క్రమంలోనే ఉన్నాయి. బంగారం ధరల పెరుగుదల బంగారం అంటే ఇష్టపడేవారిని భయపెడుతోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఇంకా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు ఉదయం మార్కెట్లు ప్రారంభం అయ్యే సమయానికి హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం  10 గ్రాములు 400 రూపాయలు పెరిగింది. దీంతో రూ.58,850ల వద్ద ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 440 రూపాయల పెరుగుదల నమోదు చేసి రూ.64,200ల వద్దకు చేరుకుంది.  

ఇవాళ మళ్లీ భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం(Gold Price today) 10 గ్రాములకు రూ. 400 మేర పెరిగి ఇవాళ రూ. 58 వేల 850 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ 10 గ్రాములకు ఇవాళ రూ. 440 పెరిగి రూ. 64 వేల 200 స్థాయికి చేరింది. ఢిల్లీలో గోల్డ్ రేట్లు ఇవాళ 22 క్యారెట్ల తులానికి రూ.400 పెరిగి రూ. 59 వేల మార్క్ తాకింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం తులానికి రూ. 440 పెరిగి రూ. 64 వేల 350 వద్దకు చేరింది. 

Also Read: గతవారంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎంత ఉన్నాయంటే..

ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి నిన్నటి రేట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం వెండి ధరలు కేజీకి రూ.83,500ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 

మరోవైపు దేశీయంగా బంగారం(Gold Price today)  ఆల్ టైమ్ హైకి  చేరుకుంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, 10 గ్రాముల బంగారం ధర రూ.553 పెరిగి రూ.63,281కి చేరుకుంది. అంతకుముందు డిసెంబర్ 1న బంగారం ఆల్ టైమ్ హైకి చేరుకుంది. అప్పుడు దాని ధర 10 గ్రాములు రూ.62,728.

పెళ్లిళ్ల సీజన్ వలన బంగారానికి(Gold Price today) డిమాండ్ పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా  చైనా లో విజృంభిస్తున్న అంతుచిక్కని వ్యాధికి కూడా ప్రజలు భయపడుతున్నారు. దీంతో బంగారానికి మద్దతు లభిస్తోందాని వారంటున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాదిలో 10 గ్రాముల బంగారం ధర రూ.67 వేలకు చేరుతుంది.

బంగారం పెరుగుదలకు 5 కారణాలు:

  • 2024లో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఏర్పడుతుందనే భయం
  • చైనా మర్మమైన వ్యాధి గురించి ప్రజలు భయపడుతున్నారు
  • పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది
  • డాలర్ ఇండెక్స్ బలహీనపడింది
  • ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తున్నాయి

వెండి కూడా 76,420 దాటింది
వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. కేజీకి  రూ.30 పెరిగిన వెండి రూ.76,430కి చేరింది. అంతకుముందు రూ.76,400గా ఉంది. నవంబర్ లో కూడా అందులో వెండి ధరలు బాగా పెరిగాయి. 

ఇక అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు(Gold Price today) పెరుగుతూనే ఉన్నాయి. ఔన్సు బంగారం అంతర్జాతీయంగా 2035 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి రేటు ఔన్సుకు 24.55 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు