Gold Price Today: వామ్మో.. పరుగు ఆపని పసిడి.. ఈరోజు బంగారం-వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. 

వరుసగా ఐదోరోజూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో రికార్డు స్థాయిలో బంగారం ధరలు ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,270ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి  రూ.79,100 వద్ద ఉంది.

Gold Price Today: వామ్మో.. పరుగు ఆపని పసిడి.. ఈరోజు బంగారం-వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. 
New Update

Gold Price Today: తగ్గడం మాట అటువుంచి కనీసం ఉన్న రేటు వద్ద నిలకడగా ఉండే పరిస్థితి కూడా లేదు బంగారం ధరలకు. ప్రతిరోజూ ధరలు పెరగడమే కనిపిస్తోంది. ఈ వారంలో వరుసగా ఐదోరోజూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. అమెరికా ఫెడ్ రేట్లు తగ్గిస్తుంది అనే వార్తలు.. ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు కంటిన్యూ అవుతుండడం, వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుండడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.  బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఈరోజు అంటే మార్చి10న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Price Today) పెరిగింది.  ఈ అన్ని కారణాలతోనూ దేశీయంగానూ బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా కాస్త పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు అంటే ఆదివారం (మార్చి10) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price Today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                        

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్(Hyderabad) లో వరుసగా ఐదో రోజు కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price Today) 500 రూపాయలు పెరిగింది. దీంతో రూ.60,750ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 540 రూపాయల పెరుగుదల నమోదు చేసి  రూ.66,270ల వద్దకు చేరుకుంది. 

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..

అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price Today) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Gold Price Today) 500 రూపాయలు పెరిగింది. దీంతో రూ.60,900ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 540 రూపాయల పెరుగుదల నమోదు చేసి  రూ.66,420లు గా నమోదు అయింది.  

Also Read : బంగారం కొనాలంటే ఇప్పట్లో అయ్యేలా లేదు.. ధరల మోత ఆగడం లేదు!

వెండి ధరలు ఇలా..

ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rate Hike)పెరుగుదల మధ్యలో వెండి కూడా పెరుగుతూ వస్తోంది. ఈరోజు కూడా వెండి ధరలు పెరిగాయి.  హైదరాబాద్ లో వెండి కేజీకి 100 రూపాయలు పెరిగి రూ.79,100ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి ధర 200 రూపాయలు పెరిగి రూ. 75,700ల వద్ద ఉంది. 

అంతర్జాతీయంగా..

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి.  దీంతో ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price Today)  2178.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర నిలకడగా (Gold And Silver Price) ఔన్స్ 24.31డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

#gold-rate-in-india #gold
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe