Gold Price Today: ఇప్పుడైతే కొనేయవచ్చు.. బంగారం తగ్గుతోంది.. వెండి కూడా అంతే.. 

వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,950ల వద్ద నిలకడగా ఉన్నాయి.  ఇక వెండి ధర కేజీకి 500 పెరిగి రూ.77,500 వద్ద ఉంది.

New Update
Gold Price Today: బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్.. ఈరోజు గోల్డ్ రేట్స్ ఇవే!

Gold Price Today: బంగారం.. కొద్దిరోజుల క్రితం తగ్గేదేలే అన్నట్టు దూకుడుగా దూసుకుపోయింది. గ్రాము బంగారం కూడా కొనలేమేమో అనే పరిస్థితి సామాన్యులకు కల్పించింది. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. బంగారం ధరలు వరుసగా ప్రతి రోజూ తగ్గుతూ వస్తున్నాయి. దాదాపుగా వారం రోజులుగా బంగారం ధరలు ఎంతో కొంత తగ్గుతూ బంగారం కొనాలని అనుకునే వారి ఆశలకు ఊపిరి పోస్తున్నాయి. హమ్మయ్య ఇప్పుడు బంగారం కొంటే బెటర్ అనే ఆలోచన వచ్చేలా చేస్తున్నాయి. బంగారం, వెండి ధరలు నిలకడగా ఉండేవి కావు.. అలానే ఇంకా తగ్గుతాయి అని కచ్చితంగా చెప్పేలా కూడా ఉండవు. ప్రస్తుతం అయితే, బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. వెండి కూడా ప్రతి రోజూ తగ్గుతూనే వస్తోంది. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ తగ్గుతూ రావడం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold Price Today) తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. ఈరోజు అంటే జనవరి 11 న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరదాదాపుగా స్థిరంగా ఉన్నాయి.. దీంతో  దేశీయంగాను బంగారం ధరలు నిలకడగా నిలిచాయి.  మరోవైపు రెండురోజులుగా తగ్గుతూ వస్తున్నా వెండి ధరలు ఈరోజు కూడా తగ్గాయి.   ఈరోజు అంటే గురువారం  (జనవరి 11) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.     

హైదరాబాద్ లో బంగారం ధరలు:     

హైదరాబాద్(Hyderabad) లో వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price) రూ.57,700ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం కూడా ఎటువంటి మార్పు లేకుండా రూ. 62,950ల వద్ద నిలిచింది.   అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర (Gold Price Today)రూ.57,850ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్థిరంగా ఉంది. దీంతో  రూ.63,100ల వద్ద మార్పులు లేకుండా  ఉంది. 

Also Read: బంగారం ధరలు దిగి వస్తున్నాయి..వెండి ధర భారీగా పడిపోయింది..ఈరోజు ఎంతుందంటే.. 

వెండి ధరలు ఇలా: 

ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Price Today) స్థిరంగా ఉంటే.. వెండి ధరలు తగ్గుదల కనబరిచాయి.  కేజీ వెండి ధరలు 500 రూపాయల మేర తగ్గాయాయి.  దీంతో  హైదరాబాద్ లో వెండి కేజీకి  రూ.77,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 600 రూపాయలు తగ్గింది.  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,000 లకు తగ్గింది. 

మరోవైపు అంతర్జాతీయంగానూ బంగారం ధరలు(Gold Price Today) స్థిరంగా ఉన్నాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price Today)  2028.35డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.97 డాలర్లుగా కొనసాగుతోంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు