Gold Price: వామ్మో.. తులం బంగారం రూ.70 వేలా?

బంగారం కొనాలనుకునేవారికి భారీ షాక్. గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధర ఒక్కసారిగా పెరిగి షాకిచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 70వేలకు తాకే అవకాశం ఉందని ఆల్ ఇండియా జెమ్, జువెల్లరి డొమెస్టిక్ కౌన్సిల్ అంచనా వేసింది.

New Update
Gold Price: అక్షయ తృతీయ రోజు గుడ్ న్యూస్..దిగివచ్చిన బంగారం ధరలు.. ఎంతంటే..  

బంగారం ధరలు ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ఉన్న బంగారం ధరలు ఈ పెరుగుదలతో మరింత పైకి చేరుకున్నాయి. బంగారం ధరల పరుగులు ఎప్పుడు ఆగుతాయో అని బంగారం కొనాలని అనుకునే వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పట్లో ఆ అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగుతూనే ఉంది. డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. వరుసగా మూడోరోజు బంగారం ధరలు పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 70వేలకు తాకే అవకాశం ఉందని ఆల్ ఇండియా జెమ్, జువెల్లరి డొమెస్టిక్ కౌన్సిల్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ సహాదేశీయంగా హైదరాబాద్, ఢిల్లీలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ప్రస్తుతం ఔన్సుకు 2063 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సిల్వర్ ధర ప్రస్తుతం రూ. 23.68 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ చూస్తే రూపాయి మారకం విలువు రూ. 83.34 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 58, 750 మార్క్ వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 220 ఎగబాకి తులానికి రూ. 64,090వద్ద ట్రేడ్ అవుతోంది.

అటు ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాములపై రూ. 200 పెరిగి ప్రస్తుతం రూ. 58,900 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్లు రూ. 270 పెరిగి తులానికి రూ. 64,240 వద్ద కొనసాగుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ప్రస్తుతం వెండి కిలో ధర ఢిల్లీలో రూ. 300 పెరిగి రూ. 78, 900 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ లో రూ. 300 పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 80,300 గాఉంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానిక ట్యాక్స్ రేట్లు ఈ ధరలను ప్రభావితం చేస్తాయి.

ఇది కూడా చదవండి: ఈ ఐదు పండ్లు తింటే మీ కిడ్నీలు క్లీన్.. ఆ సమస్యలన్నీ పరార్!

Advertisment
తాజా కథనాలు