Gold Price: బంగారం ధర తగ్గుతుందనే ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈరోజు ఎంత ఉందంటే.. 

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.  ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,730ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి  రూ.88,000 వద్ద ఉంది.

New Update
Gold Price: బంగారం ధర తగ్గుతుందనే ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈరోజు ఎంత ఉందంటే.. 

ప్రతిరోజూ ఆశగా ధరలు తగ్గుతాయేమో అని చూసే పసిడి ప్రియులకు తగ్గేదేలే అంటూ పైపైకి బంగారం ధరలు(Gold Price) కదులుతూనే ఉన్నాయి.  సాధారణంగా బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే ఉంటోంది. ఈరోజు కూడా బంగారం ధరల పెరుగుదల ఆగలేదు. బంగారం ధరల(Gold Price) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించిన ఉత్సాహం ఈ నెలలో బంగారం ధరల్లో పెరుగుదలకు కారణంగా ఉంటున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.  

ఇక ఈరోజు అంటే ఏప్రిల్ 10న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Price Hike) పెరుగుదల నమోదు చేసింది. దేశీయంగా ఆ ఎఫెక్ట్ గట్టిగానే కనిపించింది.  దీంతో భారత్ లో కూడా బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈరోజు అంటే బుధవారం (ఏప్రిల్ 10) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                               

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో నిన్నపెరిగిన బంగారం ధరలు ఈరోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price) 100 రూపాయలు పెరిగి రూ.65,750ల వద్దఉంది.  24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు110 రూపాయలు పెరిగి రూ.71,730ల వద్దకు చేరుకుంది. 

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) భగ్గుమన్నాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 100 రూపాయలు పెరిగి  (Gold Rates Hike) రూ.65,900ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరకూడా 110 రూపాయల పెరుగుదల నమోదు చేసి  రూ.71,880ల వద్ద నిలిచింది. 

Also Read : పైపైకే అంటున్న బంగారం..టాప్ లేచిపోతోంది

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Price) పెరుగుదల తో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈరోజు.. హైదరాబాద్ లో వెండి ధరలు స్థిరంగా నిలిచాయి. కేజీ వెండి రూ.88,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి మార్పులు లేకుండా రూ.84,500ల వద్ద నిలిచింది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు ఔన్స్ బంగారం 11డాలర్లు వరకూ పెరిగింది. దీంతో  2350.39  డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప పెరుగుదలతో(Gold And Silver Price) ఔన్స్ 28.09 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

Advertisment
తాజా కథనాలు