Gold Price in Hyderabad: దిగివస్తున్న బంగారం ధరలు..పెరిగిన వెండి..ఈరోజు ఎంతంటే.. 

బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,900ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,260ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి 500 పెరిగి రూ.76,500 వద్ద ఉంది

Gold Price in Hyderabad: దిగివస్తున్న బంగారం ధరలు..పెరిగిన వెండి..ఈరోజు ఎంతంటే.. 
New Update

Gold Price in Hyderabad: ఈవారం అంతా బంగారం ధరలు ఒక్కరోజు తప్ప మిగిలిన రోజుల్లో కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చాయి. వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. మరికాస్త తగ్గి బంగారం కొనాలని అనుకునే వారికి మంచి ఛాన్స్ అనిపించేలా చేస్తున్నాయి. బంగారం ధరలు తగ్గుతుండడంతో కొనడానికి ఇదే మంచి సమయం అని అందరూ భావిస్తున్నారు.  బంగారం, వెండి ధరలు(Gold Price in Hyderabad) నిలకడగా ఉండేవి కావు.. అలానే ఇంకా తగ్గుతాయి అని కచ్చితంగా చెప్పేలా కూడా ఉండవు. ప్రస్తుతం అయితే, బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ తగ్గుతూ రావడం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలుGold Price in Hyderabad) తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. మరోవైపు రెండురోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధరలు ఈరోజు కాస్త  పెరిగాయి.   ఈరోజు అంటే శనివారం (ఫిబ్రవరి 10) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.        

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గుదల(Gold Price in Hyderabad) కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price in Hyderabad) 100 రూపాయలు తగ్గి రూ.57,900ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 70 రూపాయలు తగ్గింది. దీంతో రూ. 63,260లకు దిగివచ్చింది.  

ఢిల్లీ లో ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర (Gold Price Today) 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గి రూ.58,050ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 10 గ్రాములకు 20 రూపాయలు తగ్గింది.  దీంతో  రూ.63,310ల వద్ద కు చేరింది. 

Also Read: ఇంటి రెంటల్ ఎగ్రిమెంట్ 11 నెలలకే ఎందుకు చేస్తారు?

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Price in Hyderabad) తగ్గుదల కనపరుస్తుంటే మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త పెరుగుదల కనబరిచాయి.  కేజీ వెండి ధరలు 500 రూపాయల మేర పెరిగాయి.  దీంతో  హైదరాబాద్ లో వెండి కేజీకి  రూ.76,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 500 రూపాయలు పెరిగింది వెండి.  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 75,000 లకు చేరుకుంది. 

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold Rates Drop) వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price in Hyderabad)  2024 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.62 డాలర్లుగా కొనసాగుతోంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this Interesting Video:

#gold-rate #gold-rate-today
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe