Gold Price Hike: వామ్మో..భగ్గుమన్న బంగారం..వెండి ధరల రికార్డులు.. ఎంత పెరిగాయంటే.. 

ఒక్కరోజు గ్యాప్.. అంతే.. మళ్ళీ బంగారం భగ్గుమంది. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.67,420ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి  రూ.81,500 వద్ద ఉంది.

Gold Price Hike: వామ్మో..భగ్గుమన్న బంగారం..వెండి ధరల రికార్డులు.. ఎంత పెరిగాయంటే.. 
New Update

Gold Price Hike: ఒక్కసారిగా బంగారం భగ్గుమంది. మొన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్న స్థిరంగా ఉంది ఊరట కలిగించాయి. అయితే, ఈరోజు మాత్రం 10 గ్రాములకు దాదాపుగా 1000 రూపాయల భారీ పెరుగుదల కనబరిచి గోల్డ్ లవర్స్ ను ఉసూరుమనిపించాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల(Gold Price Hike) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించిన ఉత్సాహం ఈ నెలలో బంగారం ధరల్లో పెరుగుదలకు కారణంగా ఉంటున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. 

కొంప ముంచిన ఫెడ్ రేట్లు.. 
అమెరికా ఫెడ్ రేట్లు స్థిరంగా ఉంచుతున్నట్టు నిన్న ప్రకటించారు. అదేసమయంలో ఈ సంవత్సరంలో మూడుసార్లు ఫెడ్ రేట్లు తగ్గే అవకాశం ఉందని అంచనాలు వెలువరించారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు దూసుకుపోయాయి. సాధారణంగా అమెరికా ఫెడ్ రేట్లలో కదలికలు బంగారం(Gold Price Hike) డిమాండ్ ను ప్రభావితం చేస్తాయి. ఫెడ్ రేట్లు ఎక్కువగా ఉంటే, ఇన్వెస్టర్స్ బంగారం నుంచి పెట్టుబడులను తగ్గిస్తారు. అదే ఫెడ్ రేట్లు తక్కువ అవుతున్నాయి అంటే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే, బంగారంలో పెట్టుబడి సురక్షితమైన పెట్టుబడిగా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ నమ్ముతారు. 

ఇక ఈరోజు అంటే మార్చి22న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Price Hike) భారీగా పెరిగింది. దేశీయంగా ఆ ఎఫెక్ట్ గట్టిగానే కనిపించింది.  దీంతో భారత్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కూడా రికార్డులు సృష్టించాయి . ఈరోజు అంటే శుక్రవారం (మార్చి22) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                               

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో నిన్నపెరిగిన బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price Hike) రూ.61,800ల వద్దఉంది.  24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.67,420ల వద్దకు చేరుకుంది. 

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) భగ్గుమన్నాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు భారీగా పెరిగి  (Gold Rates Hike) రూ.61,950ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరకూడా భారీ పెరుగుదల నమోదు చేసి  రూ.67,570ల వద్ద నిలిచింది. 

Also Read : ఒక్కరోజు మురిపెమే..బంగారం ధరలు మళ్ళీ పెరిగాయ్!

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Price Hike) పెరుగుదల తో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీసింది. హైదరాబాద్ లో వెండి కేజీకి ఏకంగా 1500 రూపాయలు పెరిగి రూ.81,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 1500 రూపాయలు పెరిగింది. దీంతో  రూ. 78,500ల వద్దకు చేరుకుంది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price) 40 డాలర్లు వరకూ పెరిగింది. దీంతో  2204.38  డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప పెరుగుదలతో(Gold And Silver Price) ఔన్స్ 25.70 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

#gold #gold-rate-today-hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe