Gold Price Hike: ఒక్కసారిగా బంగారం భగ్గుమంది. మొన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్న స్థిరంగా ఉంది ఊరట కలిగించాయి. అయితే, ఈరోజు మాత్రం 10 గ్రాములకు దాదాపుగా 1000 రూపాయల భారీ పెరుగుదల కనబరిచి గోల్డ్ లవర్స్ ను ఉసూరుమనిపించాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల(Gold Price Hike) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించిన ఉత్సాహం ఈ నెలలో బంగారం ధరల్లో పెరుగుదలకు కారణంగా ఉంటున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Gold Price Hike: వామ్మో..భగ్గుమన్న బంగారం..వెండి ధరల రికార్డులు.. ఎంత పెరిగాయంటే..
ఒక్కరోజు గ్యాప్.. అంతే.. మళ్ళీ బంగారం భగ్గుమంది. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.67,420ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.81,500 వద్ద ఉంది.
Translate this News: