Gold Price Today: ఇటీవల వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మొన్న ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పది గ్రాములకు 550 రూపాయల వరకూ పెరుగుదల నమోదు చేశాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ నిన్న, మొన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు కరెక్షన్ కనబరిచినట్లు భావించవచ్చు. అయితే , ఈరోజు మళ్ళీ బంగారం ధరలు భారీగా తగ్గాయి . అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడమే దానికి కారణం . మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కేజీకి 2 వేల 500 రూపాయలు తగ్గింది వెండి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 8న బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గి గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్ ఇచ్చాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుదలతో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్రభావం ఎప్పటిలానే మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) కాస్త తగ్గుదల నమోదు చేయవచ్చు. లేదా స్థిరంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Gold Price Hike: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. మళ్ళీ తగ్గిన బంగారం ధర!
బంగారం - వెండి ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,800, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,870గా ఉంది. కేజీ వెండి కూడా స్థిరంగా ₹ 89,500 గా ఉంది.
Translate this News: