Gold Price: గుడ్ న్యూస్.. బంగారం ధరల్లో భారీ తగ్గుదల.. ఎంత తగ్గిందంటే.. 

ఈరోజు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. పది గ్రాములకు 1000 రూపాయల తగ్గుదల నమోదు చేశాయి. దీంతో ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,550ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,510ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి  రూ.86,500 వద్ద ఉంది.

Gold Price: గుడ్ న్యూస్.. బంగారం ధరల్లో భారీ తగ్గుదల.. ఎంత తగ్గిందంటే.. 
New Update

బంగారం ధరలు(Gold Price) ఒక్కసారే కిందికి దిగివచ్చాయి. రికార్డ్ ధరల నమోదు తరువాత గత మూడు రోజులుగా స్థిరంగా నిలిచిన బంగారం ధరలు తగ్గవచ్చని అందరూ భావించారు. ఆ అంచనాలను నిజం చేస్తూ బంగారం ధరలు పది గ్రాములకు ఏకంగా 1000 రూపాయలు తగ్గింది. ఈమధ్యకాలంలో బంగారం ధర ఇంత తక్కువ కావడం ఇదే మొదటిసారి. మరో వైపు వెండి ధరలు కూడా కిందికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనాలని అనుకునేవారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, నిపుణుల అంచనా ప్రకారం బంగారం ధరలు మళ్ళీ పెరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. 

సాధారణంగా బంగారం ధరలు(Gold Price)  ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరాలేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే వచ్చింది. అయితే, క్రమేపీ బంగారం ధరల్లో నిలకడ కనిపిస్తూ వస్తోంది. ఈరోజు భారీ స్థాయిలో బంగారం ధరలు పడిపోయాయి. బంగారం ధరల(Gold Price)  తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే  ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు  బంగారం ధర  ల్లో మార్పులకు కారణంగా  నిపుణులు చెబుతారు.  ప్రస్తుతం వీటితో పాటు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం ధరలు పైకీ, కిందికీ కదులుతున్నాయి. అయితే, బంగారం ధరలు తగ్గడం తాత్కాలికమే అనీ.. మళ్ళీ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే, దేశీయంగా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేసినా.. అంతర్జాతీయంగా మాత్రం బంగారం భారీ స్థాయిలో పెరిగింది. ఆ ప్రభావం మళ్ళీ దేశీయంగానూ కనిపించవచ్చని అంటున్నారు. 

ఇక ఈరోజు అంటే మే 2న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర  భారీ పెరుగుదల  నమోదు చేసింది.   అయితే,  దేశీయంగా మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు.   బంగారం ధరలు(Gold Price) ఒక్కసారిగా పడిపోయాయి.  మరోవైపు వెండి ధరలు అంతర్జాతీయంగా కాస్త పెరిగాయి. అయితే  దేశీయంగా మాత్రం ధరలు తగ్గాయి.  ఈరోజు అంటే గురువారం (మే 2) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rate) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                               

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు ఈరోజు భారీగా పడిపోయాయి.  దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate) 1000 రూపాయలు తగ్గి  రూ.65,550ల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 1090 రూపాయలు తగ్గింది. దీంతో  రూ.71,510లుగా ఉంది. 

Also Read: ఈ అక్షయ తృతీయకు బంగారం కొనే పరిస్థితి ఉంటుందా?

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) స్థిరంగా ఉన్నాయి.   ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 1000 రూపాయలు తగ్గి రూ.65,700ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 1090 రూపాయల తగ్గుదల నమోదు చేసి రూ.71,600ల వద్ద మార్పులు లేకుండా ఉంది. 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. మొన్నటివరకూ బంగారం ధరల (Gold Price) పెరుగుదలతో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీసిన విషయం తెలిసిందే. అయితే, వరుసగా రెండో రోజూ  ఈరోజు కేజీకి 500 రూపాయల మేర తగ్గాయి.  దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.86,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 500 రూపాయలు తగ్గి  రూ.83,000ల వద్దకు చేరింది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో భారీ పెరుగుదల నమోదు అయింది.  ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి ఔన్స్ బంగారం 2,324.95 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప పెరుగుదలతో(Gold And Silver Price) ఔన్స్ 26.75డాలర్లకు చేరింది.   

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

#gold-rate #gold-rate-in-hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe