Gold Price: అక్షయ తృతీయ రోజు గుడ్ న్యూస్..దిగివచ్చిన బంగారం ధరలు.. ఎంతంటే..  

ఈరోజు బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,150ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,160ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.88,700 వద్ద ఉంది.

Gold Price: అక్షయ తృతీయ రోజు గుడ్ న్యూస్..దిగివచ్చిన బంగారం ధరలు.. ఎంతంటే..  
New Update

Gold Price Today: ఈరోజు అక్షయ తృతీయ (Akshaya Tritiya). ఈరోజు కనీసం కొద్దిగా అయినా బంగారం కొనాలని కోరుకుంటారు. కానీ, ఇటీవల కాలంలో బంగారం ధరలు కొండెక్కి కూచున్నాయి. రెండు రోజుల క్రితం వరకూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. అయితే, నిన్న, ఈరోజు బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. దీంతో అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు కాస్త తగ్గి ఊరట ఇస్తున్నాయి. తగ్గింది స్వల్పమే అయినా గోల్డ్ లవర్స్ కి ధర తగ్గడం అనేది గుడ్ న్యూస్ గానే చెప్పవచ్చు. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల చోటుచేసుకుంది. అయితే, దేశీయంగా ఆ ప్రభావం కనిపించలేదు. ఇక  వెండి ధరలు కూడా వరుసగా మూడోరోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి.   

సాధారణంగా బంగారం ధరలు (Gold Price)  ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరాలేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే వచ్చింది. అయితే, క్రమేపీ బంగారం ధరల్లో నిలకడ కనిపిస్తూ  వచ్చి కాస్త ఆశలు రేపిన బంగారం ధరలు.. మధ్యలో మళ్ళీ పెరుగుదల బాట పట్టాయి. అయితే నిన్నటి నుంచి స్వల్పంగా తగ్గుదల నమోదు చేస్తూ వస్తున్నాయి. నిన్నటి ట్రెండ్ కొనసాగిస్తూ ఈరోజు బంగారం ధరలు కిందికి దిగివచ్చాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే  ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు  బంగారం ధర  ల్లో మార్పులకు కారణంగా  నిపుణులు చెబుతారు.  ప్రస్తుతం వీటితో పాటు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం ధరలు పైకీ, కిందికీ కదులుతున్నాయి.  

ఇక ఈరోజు అంటే మే10న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర  భారీగా పెరిగింది. ఆ ప్రభావం దేశీయంగా  బంగారం ధరల పై పెద్దగా కనిపించలేదు. దేశీయంగా వరుసగా రెండోరోజూ బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి..  మరోవైపు వెండి ధరలు కూడా  అంతర్జాతీయంగా కాస్త పెరిగాయి.  దేశీయంగా ఆ ప్రభావం బాగానే కనిపించింది. వెండి ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి.  ఈరోజు అంటే శుక్రవారం(మే10) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Silver Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                               

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు మళ్ళీ తగ్గుదల నమోదు చేశాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 100 రూపాయలు తగ్గి  రూ.66,150ల వద్దకు చేరింది.  24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు  110 రూపాయలు తగ్గి రూ.72,160లుగా ఉంది. 

Also Read: ఈ అక్షయ తృతీయకు బంగారం కొనే పరిస్థితి ఉంటుందా?

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..

అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) తగ్గాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 100 రూపాయలు తగ్గి రూ.66,300ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు తగ్గింది. దీంతో రూ.72,310లకు చేరుకుంది. 

వెండి ధరలు ఇలా..

ఇక వెండి విషయానికి వస్తే.. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలు( Silver Price) మాత్రం వరుసగా మూడోరోజూ పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండిధర 200 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.88,700ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 200 రూపాయల పెరుగుదల నమోదు చేసి  రూ.85,200ల వద్ద నిలిచింది. 

అంతర్జాతీయంగా..

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో ఈరోజు భారీ పెరుగుదల నమోదు అయింది.  ఈరోజు ఉదయం 9గంటల సమయానికి ఔన్స్ బంగారం 2,351.09డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కూడా భారీ పెరుగుదల నమోదు చేసి ( Silver Price) ఔన్స్ 28.35డాలర్లకు చేరింది.

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది

#gold-rate-in-hyderabad #akshay-tritiya #gold-rate
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe