Gold Price Today: ఈరోజు అక్షయ తృతీయ (Akshaya Tritiya). ఈరోజు కనీసం కొద్దిగా అయినా బంగారం కొనాలని కోరుకుంటారు. కానీ, ఇటీవల కాలంలో బంగారం ధరలు కొండెక్కి కూచున్నాయి. రెండు రోజుల క్రితం వరకూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. అయితే, నిన్న, ఈరోజు బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. దీంతో అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు కాస్త తగ్గి ఊరట ఇస్తున్నాయి. తగ్గింది స్వల్పమే అయినా గోల్డ్ లవర్స్ కి ధర తగ్గడం అనేది గుడ్ న్యూస్ గానే చెప్పవచ్చు. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల చోటుచేసుకుంది. అయితే, దేశీయంగా ఆ ప్రభావం కనిపించలేదు. ఇక వెండి ధరలు కూడా వరుసగా మూడోరోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి.
పూర్తిగా చదవండి..Gold Price: అక్షయ తృతీయ రోజు గుడ్ న్యూస్..దిగివచ్చిన బంగారం ధరలు.. ఎంతంటే..
ఈరోజు బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,150ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,160ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.88,700 వద్ద ఉంది.
Translate this News: