Gold Price: బంగారం కొనాలంటే బీ రెడీ.. మళ్ళీ తగ్గిన బంగారం.. వెండి ధరలు ఢమాల్.. 

బంగారం ఈరోజు (డిసెంబర్ 14) దిగివచ్చింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 100లు తగ్గి రూ.56,650లకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం .110ల వరకూ తగ్గి రూ.61,800ల వద్ద నిలిచింది. వెండి కూడా కేజీకి 700 రూపాయలు తగ్గి రూ.77,000ల వద్ద ఉంది

New Update
Gold Loans: గోల్డ్ లోన్స్ విషయంలో బ్యాంకులకు ఆర్థిక శాఖ కీలక సూచనలు 

Gold Price: బంగారం ధరలు కాస్త కాస్త తగ్గుతూ వస్తున్నాయి. రికార్డు స్థాయిలోకి చేరిన బంగారం ధరలు నేలచూపులు చూస్తుండటం గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. బంగారం కొనాలనుకునేవారికి ఇది కాస్త ఊరట ఇచ్చే విషయమే. సోమవారం నుంచి వరుసగా బంగారం ధరలు తగ్గాయి. ఈ నాలుగు రోజుల్లోనూ చూసుకుంటే బంగారం ధరలు 10 గ్రాములకు 1000 రూపాయల వరకూ తగ్గాయి. ఈరోజు కూడా దేశీయంగా బంగారం ధరలు కిందికి దిగివచ్చాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే అవి కూడా బంగారం ధరల రూటులోనే ఉన్నాయి. ఈ నాలుగు రోజుల్లోనూ వెండి ధరలు దాదాపుగా కేజీకి 3000 రూపాయల వరకూ దిగివచ్చాయి. ఇక ఈ ఒక్కరోజే 700 రూపాయల తగ్గుదల నమోదు చేసింది వెండి. ఈరోజు అంటే డిసెంబర్ 14 మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price) రూ. 100లు తగ్గింది. దీంతో రూ.56,650లకు దిగి వచ్చింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.110ల వరకూ తగ్గింది. దీంతో రూ.61,800ల వద్ద నిలిచింది. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గి రూ.56,800ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price) 110 రూపాయలు తగ్గి.. రూ.61,950ల దగ్గర ఉంది. 

ఇక వెండి ధరలు ఈరోజు భారీగా దిగివచ్చాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి ఏకంగా 700 రూపాయలు తగ్గింది. రూ.77,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ లోనూ వెండి రేటు కేజీకి 700 తగ్గి రూ.75,000ల వద్ద ఉంది. 

Also Read: ఆ కంపెనీల షేర్ 100 రూపాయల కంటే తక్కువ.. అదరగొట్టే రిటర్న్స్ 

అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు(Today Gold Rates) పెరుగుతూ వస్తున్నాయి.. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price) క్రితం రేటు కంటే 50  డాలర్లు పెరిగి, 2037 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర 23.91 డాలర్లుగా ఉంది. 

గమనిక: బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. 

Watch this interesting video:

Advertisment
తాజా కథనాలు