Gold and Silver Rate: బంగారం కొనాలంటే కొనేయండి.. ధరలు నిలకడగా ఉన్నాయి.. ఈరోజు ఎంతంటే.. 

రెండురోజులుగా బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,250ల వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.78,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది. 

Gold and Silver Price: బంగారం దోబూచులాట.. తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగింది.. ఎంతంటే.. 
New Update

Gold and Silver Rate: బంగారం కొనాలని అనుకుంటున్నవారికి కాస్త ఊరట దొరికినట్టే కనిపిస్తోంది. రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలతో నిరాశలో కూరుకుపోయిన పసిడి ప్రియులకు తగ్గుతున్న బంగారం ధరలు ఆశలు కలిగిస్తున్నాయి. గత వారంలో వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు రెండు రోజులుగా నిలకడగా ఉన్నాయి. బంగారం ధరలు నిలకడగా ఉండడంతో పెళ్లిళ్లకు బంగారం కొనాలని అనుకునేవారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు. బంగారం ధరల భారీ పెరుగుదల మధ్య డిమాండ్ కూడా తగ్గుతూ వచ్చింది. బంగారం కొనాలని ఆలోచన చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బంగారం ధరలు తగ్గడం కాస్త ఊరట కల్పిస్తున్నా.. ఇంకా బంగారం ధరలు(Gold and Silver Rate) పై రేంజిలోనే ఉండడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.   బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి.

అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. స్థానికంగా బంగారం డిమాండ్ తగ్గుతూ రావడం బంగారం ధరలపై(Gold and Silver Rate) ప్రభావం చూపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold Rate) తగ్గుముఖం పట్టడం.. నిలకడగా ఉండడం అనేది అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. ఈరోజు అంటే జనవరి 08న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో  దేశీయంగాను బంగారం ధరలు స్థిరంగా నిలిచాయి. మరోవైపు వెండి ధరలు కూడా మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి.  ఈరోజు అంటే సోమవారం (జనవరి 08) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.    

హైదరాబాద్ లో బంగారం ధరలు:     

హైదరాబాద్(Hyderabad) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Rate) ఎటువంటి మార్పులు లేకుండా  రూ.58,000ల వద్ద నిలిచింది.   24 క్యారెట్ల బంగారం కూడా స్థిరంగా రూ. 63,420ల వద్ద కొనసాగుతోంది.   అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు నిలకడగానే ఉన్నాయి.  ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,150ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.63,250ల వద్ద స్థిరంగా ఉంది. 

Also Read: బంగారం ధరలు దిగి వస్తున్నాయి..వెండి ధర భారీగా పడిపోయింది..ఈరోజు ఎంతుందంటే.. 

వెండి ధరలు ఇలా: 

మరోవైపు వరుసగా మూడోరోజు కూడా  వెండి ధరలు(Gold and Silver Rate) నిలకడగా ఉన్నాయి. వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు.  దీంతో  హైదరాబాద్ లో వెండి కేజీకి  రూ.78,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు స్థిరంగా ఉంది.  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,600 లుగా నిలిచింది. 

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this interesting Video:

#gold-and-silver-price #silver
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe