Gold and Silver Rate: బంగారం కొంటారా? గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి..ఈరోజు ఎంత ఉందంటే.. 

బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,950ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.76,500 వద్ద మార్పులు లేకుండా ఉంది.

New Update
Gold Rates : బాబోయ్ ఇలా పెరుగుతున్నాయేటీ.. రోజురోజుకూ కొండెక్కుతున్న బంగారం ధరలు

Gold and Silver Rate: బంగారం కొనాలి అనుకునే వారికి ఇది ఊరట ఇచ్చే వార్తే. ఎందుకంటే, బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది. ఇక బంగారం ఇప్పుడు కొనుక్కోవడానికి వీలుగా తగ్గుముఖం పట్టడం అందరికీ సంతోషాన్నిస్తుందనడంలో డౌట్ లేదు. పెళ్లి అంటే కచ్చితంగా బంగారం కొనాల్సిందే. అందుకే ధరలు తగ్గుతుండడంతో కొనడానికి ఇదే మంచి సమయం అని అందరూ భావిస్తున్నారు.  బంగారం, వెండి ధరలు(Gold and Silver Rate) నిలకడగా ఉండేవి కావు.. అలానే ఇంకా తగ్గుతాయి అని కచ్చితంగా చెప్పేలా కూడా ఉండవు. ప్రస్తుతం అయితే, బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ తగ్గుతూ రావడం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold and Silver Rate) తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. మరోవైపు నిన్న పెరుగుదల కనబర్చిన వెండి ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి.  ఈరోజు అంటే ఆదివారం (ఫిబ్రవరి 11) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.        

హైదరాబాద్ లో బంగారం ధరలు.. 
హైదరాబాద్(Hyderabad) లో వరుసగా మూడో రోజూ బంగారం ధరలు తగ్గుదల(Gold and Silver Rate) కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price) 200 రూపాయలు తగ్గి రూ.57,700ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 210 రూపాయలు తగ్గింది. దీంతో రూ. 62,950లకు దిగివచ్చింది.  

ఢిల్లీ లో ఇలా.. 
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర (Gold and Silver Rate) 10 గ్రాములకు 200 రూపాయలు తగ్గి రూ.57,850ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 10 గ్రాములకు 210 రూపాయలు తగ్గింది.  దీంతో  రూ.63,100ల వద్ద కు చేరింది. 

Also Read: దిగివస్తున్న బంగారం ధరలు..పెరిగిన వెండి..ఈరోజు ఎంతంటే.. 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold and Silver Rate) తగ్గుదల కనపరుస్తుంటే మరోవైపు వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.  హైదరాబాద్ లో వెండి కేజీకి  రూ.76,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు మార్పులు లేకుండా ఉంది.  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 75,000 ల వద్ద స్థిరంగా ఉంది. 

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold Rates Drop) వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price Today)  2024 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.62 డాలర్లుగా కొనసాగుతోంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this Interesting Video:

Advertisment
తాజా కథనాలు