Gold and Silver Price : బంగారం ధర మళ్లీ పెరిగింది.. వెండి కాస్త తగ్గింది.. ఈరోజు ఎంతంటే.. మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,450ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,670ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 500 తగ్గి రూ.77,500 వద్ద ఉంది. By KVD Varma 20 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Gold and Silver Price Today : పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్ బంగారం ధరలపై పడుతోంది. దీంతో ధరలు క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. గత వారం చివరి రెండురోజుల్లోనూ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ వారం ప్రారంభం నుంచీ అదే దారిలో ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరుగుదల చూపిస్తున్నాయి. దీంతో ఆ ప్రభావం దేశీయంగానూ కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ దానికి తోడుకావడంతో బంగారం ధరల మీద ప్రభావం చూపిస్తోంది. దీంతో ఈరోజు అంటే ఫిబ్రవరి 18న బంగారం పెరుగుదల కనబరిచింది. బంగారం ధరల(Gold and Silver Price) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం .. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం డిమాండ్ పెరుగుతూ ఉండడం బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే ఫిబ్రవరి 20న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold and Silver Price)స్వల్పంగా పెరిగింది. దీంతో దేశీయంగాను బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు వరుసగా మూడో రోజూ భారీగా పెరిగాయి. ఈరోజు అంటే ఆదివారం (ఫిబ్రవరి 20) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold and Silver Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో బంగారం ధరలు.. హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు బంగారం ధరలు కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Price) 250 రూపాయలు పెరిగింది. దీంతో రూ.57,450ల వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 270రూపాయలు పెరిగి రూ. 62,670ల కు చేరుకుంది. ఢిల్లీలో బంగారం ధరలు ఇలా.. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold and Silver Price) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) 250 రూపాయలు పెరిగి 10 గ్రాములకు రూ.57,600ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 270రూపాయలు పెరుగుదల కనబరిచి రూ.62,820ల వద్దకు చేరుకుంది. Also Read : తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. వెండి ధరలు ఇలా.. ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Rate Today) పెరుగుదల నమోదు చేస్తుంటే వరుసగా పెరుగుతూ వస్తున్నవెండి ధరలు కాస్త కిందికి దిగి వచ్చాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 500 రూపాయలు తగ్గి రూ.77,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 500 రూపాయలు తగ్గింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,000 లకు దిగివచ్చింది. అంతర్జాతీయంగా.. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Today Gold Price) 2017డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కాస్త తగ్గడంతో(Gold and Silver Price) ఔన్స్ 22.97 డాలర్లుగా ఉంది. గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి. Watch this Interesting Video : #gold #gold-rate-in-hyderabad #gold-and-silver-price మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి