AP Liquor: మద్యం కోసం సిబ్బంది అతి తెలివి.. నివ్వెరపోయిన అధికారులు

శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో గోల్ మాల్ అయ్యాయి. తప్పుడు లెక్కలు చూపించి దుకాణంలో పనీచేసే ప్రభుత్వ ఉద్యోగస్తులు మద్యం బాటిళ్లు మాయం చేశారు. రహస్య సమాచారంతో మద్యం షాపులపై ఎక్సైజ్ శాఖ పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. విస్తు పోయే నిజాలు వెలుగు చూసిన వైనం.. ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారులే దోచుకు తింటున్న వైనం.

New Update
AP Liquor: మద్యం కోసం సిబ్బంది అతి తెలివి.. నివ్వెరపోయిన అధికారులు

శ్రీకాళహస్తి పట్టణంలోని 4 మద్యం దుకాణాల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో మద్యం షాపులో 3 లక్షల నుంచి 6 లక్షల వరకు నగదు, మద్యం బాటిళ్లు గోల్ మాల్ జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అవకతవకలు జరిగిన దుకాణంలో పని చేసే సిబ్బందిని ఎక్సైజ్ ఎస్సై విచారిస్తున్నారు. విచారణలో అవకతవకలకు సహకరించిన పలువురు ఎక్సైజ్ అధికారుల పేర్లు దుకాణంలో పనేచేసే సిబ్బంది వెల్లడించారు. తీగ లాగితే డొంక కదిలిన వైనంలో గతంలో జరిగిన అవినీతి కూడా బట్టబయలు అయింది. పట్టణంలోని చెంచులక్ష్మి కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణంలో రూ.55 లక్షలు మేర డబ్బును షాప్‌లో పనిచేసే ఇందు కుమార్ అనే ఉద్యోగి కాజేశాడు.

డబ్బుతో సహా పారిపోవడంతో అతనిపై కేసు నమోదు చేయకుండా.. అధికారులు రహస్యంగా విచారణ చేసి మమ అనిపించారు. రహస్య సమాచారంతో ఇందు కుమార్‌నీ పట్టుకొని అతనికి చెందిన భూమిని అమ్మి 10 లక్షల రూపాయల డబ్బుని ఎక్సైజ్ అధికారులు రికవరీ చేశారు. మిగిలిన డబ్బులు రికవరీ చేయలేక శ్రీకాళహస్తి పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో అనధికారికంగా ఒక్కో షాపు నుంచి 1 నుంచి 3 లక్షల మేర ఉద్యోగస్తుల నుంచి శ్రీకాళహస్తి ఎక్సైజ్ సీఐ,ఎస్సై, డిపో మేనేజర్ వసూళ్లు చేశారు. వసూళ్లు చేసిన అనధికార డబ్బులను ప్రభుత్వానికి కట్టకుండా అధికారులు స్వాహా చేశారు. ఇన్సూరెన్స్ రూపంలో నష్టాన్ని పుడ్చవచ్చు అనే ఆలోచనతో శ్రీకాళహస్తి శివారులోని సింగమాల గ్రామంలోని ఒక చిన్న మద్యం దుకాణంలో 55 లక్షల రూపాయల మద్యం స్టాక్ ఉన్నట్లు చూపించి రాత్రికి రాత్రే దుకాణాన్ని ఎక్సైజ్ అధికారి తగల పెట్టించాడు.

అయితే.. ప్రాథమిక దర్యాప్తులో షాక్ సర్క్యూట్‌తో మద్యం దుకాణం తగల పడి 55 లక్షల రూపాయల మేర మద్యం బాటిళ్లు కాళీ బూడిదై పోయినట్లు కేసు నమోదు చేశారు. ఇటు ప్రభుత్వాన్ని, అటు ఇన్సూరెన్స్ అధికారులను బురిడీ కొట్టించి తగలబడిన మద్యం దుకాణంకి నష్టపరిహారం వచ్చేలా చేశాడు అధికారి. రాష్ట్రం మొత్తం మీద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలపై తనిఖీలు చేయగా.. ఒక జిల్లా అధికారులని మరో జిల్లాకు బదలాయిస్తూ తనిఖీలు చేపట్టడంతో శ్రీకాళహస్తిలోని మద్యం దుకాణాలలో బయటబడ్డ అవినీతి బాగోతం. కంచె చేను మేసినట్ట అవినీతికి పాల్పడిన కిందిస్థాయి సిబ్బందినీ వారికి సహకరించిన పైస్థాయి అధికారుల జాడలని కనిపెట్టెందుకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఎక్సైజ్ శాఖ పోలీసు అధికారులు పావులు కదుపుతున్నారు. మొత్తం తీగ లాగి డొంకను కదిల్చే పనిలో వున్నట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: ఐదురోజులపాటు వివస్త్రలుగా మగువలు..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

Advertisment
Advertisment
తాజా కథనాలు