TG News: జలదిగ్బంధంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం.. మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం 53 అడుగుల వద్దకు నీరు చేరటంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 30 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. మరో 2 అడుగుల వరకు గోదావరి పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

New Update
TG News: జలదిగ్బంధంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం.. మూడో ప్రమాద హెచ్చరిక

Bhadrachalam: భారీ వర్షాల కారణంగా మహోగ్రరూపం దాల్చింది గోదావరి నది. భద్రాచలం వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం 53 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తునదున్న అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాచలం అశోక్‌నగర్, కొత్తకాలనీ, AMC కాలనీలోకి వరద నీరు చేరింది. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీటిని మోటార్ల సహాయంతో నీటిని గోదావరిలోకి అధికారులు పంపిస్తున్నారు. 30 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. జలదిగ్బంధంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం ఉండగా.. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరో 2 అడుగుల వరకు గోదావరి పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎగువ రాష్ట్రం కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో భారీ వర్షం కారణంగా తాళిపేరుకు వరద నీరు పోటెత్తుతున్నది. ప్రస్తుతం తాళిపేరు వద్ద 25 గేట్లను అధికారులు ఎత్తిన్నారు. లక్షా 7 వేల 714 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తాళిపేరు ఇన్‌ఫ్లో లక్షా 297 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో లక్షా 7 వేల 714 క్యూసెక్కులు నీరు ఉంది. ఇప్పటికే భద్రాచలం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే జాతీయ రహదారిపైకి వరద చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయ్యాయి. వర్షాలతో భక్తులు లేక నిర్మానుష్కంగా రామాలయం ఉండగా.. గోదారమ్మ శాంతించు తల్లి అంటూ ఆలయ అధికారులు పూజలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో వేడి నీటితో స్నానం చేయడం బిడ్డకు ప్రమాదకరమా?

Advertisment
తాజా కథనాలు