మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఈ వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి నది18.9 అడుగులకు చేరుకుంది. 35 అడుగులు చేరుకుంటే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు కూనవరం వద్ద శబరి గోదావరి సంగమం వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఒకవైపు శబరినది, మరో వైపు గోదావరి నదులు క్రమంగా పెరగడంతో లోతట్టు గ్రామాల ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. గత ఏడాది గోదావరి వరదకు విలీన మబ్బు మండలాలలో 300 గ్రామాలు పంపు బారిన పడిన విషయం తెలిసిందే. వరద సృష్టించిన నష్టాన్ని ముంపు ప్రాంత ప్రజలు ఇప్పటికి తెరుకోలేక పోయారు. అయితే ఈ రోజుతో వరద భయనకరానికి సంవత్సరం కావొస్తుందని ప్రజలు తెలిపారు. ఒకవైపు అధికారులు వరద సమీక్ష సమావేశాలు ముందస్తు చర్యలు చేపట్టడం లేదంటూ ముంపు వాసుల్లో ఆందోళన ఉంది.
రికార్డు స్థాయిలో వాన
ఇదిలాంటే రాష్ట్రంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. రికార్డు స్థాయిలో 100.6 మిల్లీమీటర్ల వాన పడింది. శుక్రవారం ఉదయం జిల్లాలో 44.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే గరిష్టం. మరో మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజమహేంద్రవరం రూరల్‌లో 25.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షం పడింది. గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరిలో ఇన్‌ఫ్లో పెరుగుతుంది.
మరో రెండు రోజులు వానలు
అయితే.. ఏపీలో మరో రెండు రోజులు వానలు కొనసాగుతాయని వాతారణశాఖ అంచనా వేస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ఈ నెల 16న ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈ 17న లేదా 18న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని భావిస్తున్నారు. ఈ నెల మూడో వారంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం
ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా వర్షాలు జోరుగా పడుతున్నాయి. రాగల మూడు రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. నేడు హన్మకొండ, జనగాం, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.