Visakhapatnam to Hyderabad: 50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

విశాఖపట్నం నుంచి హైద్రాబాద్ వరకు భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో ఎనలేని సేవలను అందించిన గోదావరి  ట్రైన్ తన సేవలను ప్రారంభించి నేటికి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా విశాఖ రైల్వే స్టేషన్లో కేక్ కటింగ్ నిర్వహించి రైల్వే అధికారులు తమ అనందాన్ని వ్యక్తం చేశారు.

New Update
Visakhapatnam to Hyderabad: 50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

50 years of Godavari Express:  గోదావరి ఎక్స్ ప్రెస్..ఈ ట్రైన్ పేరు తెలియని తెలుగు వారుండరు. ఈ ట్రైన్ లో ప్రయాణం ఏదో తెలియని అనుభూతినిస్తుంది. ఈ ట్రైన్లో ప్రయాణం ఒక సెంటిమెంట్. ఎన్నో ఆశలతో హైద్రాబాద్ చేరుకోవాలనే వారికి గోదావరి రైలు ప్రయాణం ఒక స్వాంతన నిస్తుంది. ఈ రైలులో ప్రయాణిస్తున్నంత సేపూ తమ సొంత బంధువులతో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది.తమ గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకొని వెళ్తుందని ఒక నమ్మకాన్నిస్తుంది గోదావరి రైలు. సమయపాలన విషయంలో కానీ , శుభ్రత విషయంలో కానీ ఎక్కడా రాజీపడకుండా .విశాఖపట్నం నుంచి హైద్రాబాద్ వరకు భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో 5 దశాబ్దాలుగా ఎనలేని సేవలను అందించిన ఈ గోదావరి  ట్రైన్ తన సేవలను ప్రారంభించి  నేటికీ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

ఫిబ్రవరి 1, 1974 న సేవలను మొదలు పెట్టిన గోదావరి రైలు 

భారత దక్షిణ మధ్య రైల్వే లోని ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీస్ గా పేరుగాంచిన గోదావరి రైలుని వాల్తేరు ⇌ హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ క్రింద  ఫిబ్రవరి 1, 1974 న ట్రైన్ నెంబర్లు 7007, 7008 తో ప్రవేశపెట్టారు.ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728 ట్రైన్ నంబర్ల తో విశాఖ పట్నం - హైదరాబాద్ మద్య సేవలను కొనసాగిస్తోంది. ఈ రైలు ప్రారంభించిన మొదట్లో  ఒక రోజు విశాఖ నుంచి మరుసటి రోజు సికిందరాబాద్ నుంచి బయలు దేరేది.  విశాఖలో సాయంత్రం  5.20 కి స్టార్ట్  అయి మరుచటి రోజు  ఉదయం 6.45 కు హైదరాబాద్ చేరుకునేది. ఆ రోజు హైదరాబాద్ లో ఇదే రైలు ఉదయం 5.10 కి బయలుదేరి విశాఖలో మరుసటి ఉదయం 5.50 కి చేరుకునేది.18 స్టేషన్లలో ఆగే ఈ గోదావరి ట్రైన్ ప్రయాణ దూరం 710 కిలో మీటర్లు (440 మైల్స్) ఉండగా ,  సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిముషాలు పడుతుంది.

6 ఎయిర్ కండిషన్డ్ కోచ్ లున్న మొదటి రైలుగా  గుర్తింపు

మొదటి ఫస్ట్ క్లాస్ ఎయిర్ కండిషన్ లు మొదలయింది గోదావరీ ఈ రైలే కావడం విశేషం. 2000 సంవత్సరంలో 6
ఎయిర్ కండిషన్డ్ కోచ్ లున్న మొదటి రైలుగా  గుర్తింపు పొందిన ఈ ట్రైన్లో మొత్తం 17 బోగీలుంటాయి. ఈ  రైలు గంటకు 57 కిలో మీటర్లు (35 మైల్ ఫర్ అవర్) వేగంతో ప్రయాణిస్తుంది.తొలినాళ్ళ నుంచి గోదావరీ ఎస్ప్రెస్ గా నడిచిన ఈ ట్రైన్  2011 ఈ గోదావరి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గా మారింది.  ఆ యేడాదే రైలు నంబర్ ను 12727 గా మార్చారు. అంతేకాదు, WAP-7 బండి అయింది. WAP-7 అంటే బ్రాడ్ గేజ్ (w) AC కరెంట్ (A) ప్యాసెంజర్ ట్రాఫిక్ (P) సెవన్గ్ జనరేషన్ ట్రెయిన్ .

విశాఖ రైల్వే స్టేషన్లో కేక్ కటింగ్ వేడుకలు 
ఈ 50 ఏళ్లలో ఎందరో ప్రయాణికులకు ఎన్నో రకాల సేవలు అందించిన ఘనత సొంతం చేసుకున్న సందర్భంగా నేటి
సాయంత్రం గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు కు దక్షిణ మధ్య రైల్వే శాఖ వేడుకలు నిర్వహించే పనిలో ఉంది.ఎంతో మంది భావో ద్వేగాలు కలిగిన గోదావరి ఎక్స్ప్రెస్ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ రైల్వే స్టేషన్లో కేక్ కటింగ్ నిర్వహించి రైల్వే అధికారులు తమ అనందాన్ని వ్యక్తం చేశారు.డ్రైవర్లు  సైతం గోదావరితో  పని చేయడం చాలా సుముఖత చూపిస్తారు. అందుకే తెలుగు ప్రజలకు  గోదావరి రైలు ఒక అన్నపూర్ణగా కనిపిస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు