Divors Temple: విడాకులు కావాలా.. అయితే ఆ గుడికి వెళ్లండి

జపాన్‌లోని కమకురానగరంలో ఉన్న గుడికి 600 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ గుడిపేరు మత్సుగోకా టోకీ-జీ. 12వ, 13వ శతాబ్దాల్లో జపనీస్ సమాజంలో విడాకుల నిబంధనలు పురుషుల కోసం మాత్రమే అమలు చేసేవారంట. ఆ కాలంలో మగవారు వారి భార్యలకు చాలా సులభంగా విడాకులు ఇచ్చేవారు.

New Update
Divors Temple: విడాకులు కావాలా.. అయితే ఆ గుడికి వెళ్లండి

Divors Temple:భార్య భర్తల కాపురం సరిగ్గా లేకుంటే.. వారు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు. కానీ అక్కడ ప్రజలు మాత్రం విడాకుల కోసం ఖచ్చితంగా ఆ ఆలయానికి వెళ్తరంట. ఇది వినటానికి కొంచెం వింతగా అనిపిస్తుందని కానీ ఇది నిజం. సాధారణంగా కోరిన కోరికలు తీరాలంటే దేవుడికి మొక్కుకుంటాం. ఆ తర్వాత ముడుపులు కడుతుంటారు. అయితే కొన్ని ఆలయాల్లో ప్రత్యేకించి కొన్ని కోరికలు నెరవేరుతాయని మనం అప్పుడప్పుడూ వింటుంటా. మనకి నమ్మకం ఉన్న గుడికి వెళ్లి అక్కడ మొక్కుకుంటే ఖచ్చితంగా పని అవుతుందని కొందరి భక్తులకు నమ్మకం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎన్నో వింత చరిత్రకలిగి ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే నిజమా అనిపిస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా విడాకుల ఆలయం గురించి విన్నారా..? ఆలయం విడాకుల వినడానికి చిత్రంగా ఉన్నా.. ఇది నిజంగానే ఉంది. అలాంటి ఎక్కువ ఉందో.. ఇప్పుడు దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వేధింపులకు గురైన మహిళల కోసం:

జపాన్‌లోని కమకురానగరంలో ఈ గుడి చరిత్ర సుమారు 600 ఏళ్ల నాటిది. ఈ దేవాలయం గృహ హింసకు గురైన మహిళలకు న్యాయం చేసే నిలయంగా చూస్తుంటార అక్కడి ప్రజలు. శతాబ్దాల క్రితం స్త్రీలు తమ నిరంకుశ భర్తలను వదిలించుకోవడానికి ఈ ఆలయాన్ని ఆశ్రయించేవారని చెబుతారు. జపాన్‌లో ఉన్న ఈ దేవాలయం పేరు మత్సుగోకా టోకీ-జీ. 12వ, 13వ శతాబ్దాల్లో జపనీస్ సమాజంలో విడాకుల నిబంధనలు పురుషుల కోసం మాత్రమే అమలు చేసేవారంట. ఆ కాలంలో మగవారు వారి భార్యలకు చాలా సులభంగా విడాకులు ఇచ్చేవారు. అయితే గృహ హింస.. వేధింపులకు గురైన మహిళల కోసం ఓ గుడిన్ని నిర్మించారు.

ఆ ఆలయంలో పురుషుల ప్రవేశాన్ని నిషేధం:

జపాన్‌లోని కామకురా యుగంలో ఈ ఆలయాన్ని కకుసన్-ని అనే సన్యాసి నిర్మించారు. ఆమె తన భర్తతో ఎప్పుడూ సంతోషంగా జీవించలేదు. అయితే భర్త నచ్చలేదని ఆమెకు విడాకులు తీసుకునే మార్గం లేదు. దీంతో ఈ ఆలయాన్ని నిర్మించింది. స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఈ ఆలయంలో సుమారు మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత మహిళలు తమ భర్తలతో సంబంధాలు తెంచుకోవచ్చు. కాలక్రమంలో ఈ గడువుని రెండేళ్లకు తగ్గించారు. 1902 సంవత్సరం వరకు ఆలయంలో పురుషుల ప్రవేశాన్ని నిషేధించారు. అయితే 1902లో ఈ ఆలయ సంరక్షణను ఎంగాకు-జీ స్వీకరించినప్పుడు.. ఆలయ నిర్వహణకు మగ మఠాధిపతిని నియమించాడు. ఇక ఆ తర్వాత ఈ ఆలయంలో మొక్కుకుంటే విడాకులు వస్తాయని స్థానికులు నమ్మేవారు. దీంతో విడాకులు తీసుకోవాలి అనుకునే చాలా మంది ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. శతాబ్దాల క్రితం స్త్రీలు తమ నిరంకుశ భర్తలను వదిలించుకోవడానికి ఈ ఆలయాన్ని ఆశ్రయించేవారని చెబుతారు.

ఇది కూడా చదవండి: ఫ్రిజ్‌లో ఫ్రూట్స్ తింటే.. ప్రాణానికే ముప్పే

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు