/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/fans-jpg.webp)
Ramcharan: గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఎంట్రీ తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే, తాజాగా ఆయన మరో ఘనత సాధించారు.
చెన్నైలోని ప్రముఖ వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు డాక్టరేట్ ను ప్రధానం చేసింది. సినీ ఇండస్ట్రీకి నటుడిగా అతడు అందిస్తున్న సేవలకుగానూ ఈ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Also Read: శ్రీలీల ప్లేస్ లో ప్రేమలు హీరోయిన్.. స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు..!
సోషల్ మీడియాలో చరణ్ కు సెలబ్రేటీలు పెద్ద ఎత్తున ప్రశంసంలు కురిపిస్తున్నారు. ఈ విషయంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పందించారు. 17ఏళ్ల కెరీర్.. 14 సినిమాలు..సాధించిన కీర్తి.. దిగంతాలు వ్యాపించేలా.. పొందిన ప్రేక్షకాదరణ.. దిక్కులు ప్రతిధ్వనించేలా.. తనే మన శ్రీ కొణిదెల రామ్ చరణ్ అంటూ పోస్ట్ చేశారు.
Vels University Tamilnadu, the renowned academic institution bestowing an Honorary Doctorate on @AlwaysRamcharan makes me feel emotional and proud as a father. It is an exhilarating moment.
True happiness for any parent is when the offspring outperforms their achievements. And… pic.twitter.com/OFuzYc80gq
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2024
'చిన్న వయసులో ఖండాంతరాలు దాటిన ఖ్యాతి ఓవైపు.. సినీ కళామతల్లికి చేస్తున్న సేవలు గుర్తించి దక్కిన గౌరవ డాక్టరేట్ మరోవైపు. ఇది కదా తండ్రికి పుత్రోత్సాహం.. అభిమానులకు సంతోషం తెలుగు సినిమా ఖ్యాతి.. భారతీయ సినిమా ఉనికి.. ఇవేకదా మన చిరంజీవి తనయుడు శ్రీ రామ్ చరణ్ సాధించిన.. సాధిస్తున్న ఘన కీర్తి.
మీరు సాధించిన విజయాలకు.. చేస్తున్న సేవలకు దక్కిన గౌరవ డాక్టరేట్ తో మీపై గౌరవం, అభిమానం రెట్టింపు అయింది. మున్ముందు మీరు మరిన్ని విజయాలు సాధించాలి.. పురస్కారాలు పొందాలి.. ఉన్నతమైన గౌరవాలు పొందాలి..మెగా కుటుంబం పేరు ప్రఖ్యాతులు మరింత పెంచాలి. అభిమానులుగా ఇదే మా ఆకాంక్ష. మీ లక్ష్యసాధనలో నిరంతరం మీ వెంటే మేము' అంటూ అభిమానులు సైతం పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.