Love Life: ఇలా ఉంటేనే అమ్మాయిలు ప్రేమిస్తారట.. అది ఎలానో తెలుసుకోండి!

Love Life: ఇలా ఉంటేనే అమ్మాయిలు ప్రేమిస్తారట.. అది ఎలానో తెలుసుకోండి!
New Update

Love Tips: అనుభూతులు అనేకం..అలరించేవి కొన్ని, అల్లరి చేస్తాయి మరికొన్ని, అందమైనవి ఇంకొన్ని, అరుదైనవి కొన్ని..ప్రేమలో ఇవన్నీ ఉంటాయంటారు. ప్రతి ఒక్కరిలో అందమైన అనుభూతి ఈ ప్రేమ. జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడనివారుండరు. ఈ ఒక్క భావన కలగడానికి వెయ్యి కారణాలుంటాయని అంటున్నారు. సినిమాల్లో చూపించినట్టు తొలిచూపులోనే ప్రేమలో పడిపోరని పరిశోధకులు అంటున్నారు.

ప్రేమలో పడటానికి ఇవే కారణాలు..

ప్రేమలో పడటానికి చాలా కారణాలు ఉంటాయని చెబుతున్నారు. శారీరక ఆకర్షణ, భావాలు కలవడం, స్థితిగతులు ఇలా అనేకం ఉంటాయని తేలింది. ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిల్లో కొన్ని గుణాలను చూసి ఇష్టపడతారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటంటే..
అబ్బాయి ఎత్తు..
*అమ్మాయిలు ప్రేమలో పడటానికి ఎత్తు కూడా ఒక కారణమట, పెద్దగా శరీర ఆకృతి లేకపోయినా ఎత్తు ఎక్కువ ఉంటే చాలట. ఎందుకంటే పొడుగ్గా ఉన్నవారు కౌగిలించుకునేందుకు, ముద్దు పెట్టుకునేందుకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటారని అందుకే అమ్మాయిలు వారిని ఇష్టపడతారని కొన్ని అధ్యయాల్లో వెల్లడైంది.
చక్కటి వాసన..
అమ్మాయిలు ప్రేమలో పడాలంటే వాసన కూడా ముఖ్యమేనట, చాలా మంది అబ్బాయిలు ఎక్కువ సువాసన వచ్చే సెంట్లను వాడటం వల్ల కూడా ఆ స్మెల్‌కు అమ్మాయిలు ఆకర్షితులై ప్రేమలో పడతారని నిపుణులు చెబుతున్నారు.
ఒకరినొకరు చూసుకోవడం..
*చూపులు కలిసిన శుభవేళ అంటూ ఉంటారు. అలాగే అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరి కళ్లలో మరొకరు కళ్లు పెట్టి కొన్ని నిమిషాల పాటు చూసుకుంటే వారి మధ్య ప్రేమతో పాటు ఆప్యాయత మరింత పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
తెగింపు..
*డేర్‌ అండ్‌ డ్యాషింగ్‌గా ఉండే మగవారు అంటే మహిళలు ఎక్కువగా లైక్‌ చేస్తారట. ఎందుకంటే వారి కోసం ఆ మగవారు ఎంతటి రిస్క్‌ అయినా చేస్తారని నమ్ముతారని అంటున్నారు. ఆ వ్యక్తితో ఉంటే భరోసాగా ఉంటుందని, అందుకే వారి మధ్య ఆకర్షణ మరింత పెరిగే ప్రేమగా మారుతుందని మానసిక నిపుణులు అంటున్నారు.
ఉద్యోగ భద్రత..
*ప్రేమతో పాటు ఆ అబ్బాయి ఆర్థికంగా స్థిరంగా ఉన్నాడా.. మంచి ఉద్యోగం ఉందా, ఆస్తుల వివరాలను కూడా చూస్తారట, జీవితంలో తనను కష్టపెట్టకుండా చూసుకోగలడా అనేది చూస్తారని, వారి భాగస్వామి సమాజంలో ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటారని చెబుతున్నారు.
చిరునవ్వు..
*చిరునవ్వుకు ఆకర్షణకు ఎంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నవ్వుతూ పక్కవారిని నవ్వించే అబ్బాయిలను కూడా అమ్మాయిలు బాగా ఇష్టపడతారని అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.

ఇది కూడా చదవండి: ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో డార్క్ సర్కిల్స్‌ను ఈజీగా తొలగించుకోవచ్చు!

WATCH:

#life-style #love #love-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe