కోహ్లీకి బహుమతి ఇచ్చిన చిన్నారి! విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. వెస్టీండీస్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి 1-0 తో ముందంజలో ఉన్న టీమ్ ఇండియా శనివారం జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే By Bhavana 31 Jul 2023 in Scrolling స్పోర్ట్స్ New Update షేర్ చేయండి విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. వెస్టీండీస్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి 1-0 తో ముందంజలో ఉన్న టీమ్ ఇండియా శనివారం జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ తో మనవాళ్లు అభిమానులను అలరించకపోయినప్పటికీ కూడా..కోహ్లీ చేసిన ఓ పని మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ఆట ముగిసిన తరువాత ఓ చిన్నారి వద్దకు వెళ్లాడు. ఆమె తో పాటు ఆమె కుటుంబాన్ని కూడా కోహ్లీ ఆప్యాయంగా పలకరించాడు. ఆట ముగిసిన తర్వాత ఆ చిన్నారి గట్టిగా కోహ్లీ..కోహ్లీ అంటూ పిలవడంతో కోహ్లీ ఆమె వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో కోహ్లీ ఆ చిన్నారి వద్ద నుంచి ఓ అరుదైన బహుమతిని అందుకున్నాడు. ఆ చిన్నారి కోహ్లీకి ఓ బ్రెస్‌లేట్ ను బహుమతిగా అందించింది. ఆ బ్రేస్ లేట్ అందుకున్న తరువాత కోహ్లీ ఆ చిన్నారికి థ్యాంక్యూ అంటూ చేయి కలిపాడు. తరువాత ఆమె కుటుంబానికి తన ఆటోగ్రాఫ్ ఇచ్చి వాళ్లతో సెల్ఫీ దిగాడు. కోహ్లీ కి వచ్చిన బహుమతిని తన జట్టుతో పంచుకోగా వారంతా కోహ్లీకి అభినందనలు తెలిపారు. తరువాత జట్టులోని కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ కూడా ఆ చిన్నారి కుటుంబంతో కలిసి కొంత సేపు గడిపారు. అనంతరం ఫోటోలు కూడా దిగారు. దీని గురించి ఆ చిన్నారి స్పందిస్తూ నేను కోహ్లీ కోహ్లీ.. అంటూ అరుస్తుంటే కోహ్లీ విని నా దగ్గరకు వచ్చాడు. అప్పుడే నేను స్వయంగా.. చేసిన బ్రేస్‌లెట్‌ను తనకు ఇచ్చానని’ చిన్నారి చెప్పింది. దీని గురించి చిన్నారి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. నా కూతురు పిలవగానే కోహ్లీ మా వద్దకు వచ్చాడు. పాప తీసుకుని వచ్చిన బ్రేస్ లెట్ తీసుకుని నేను వేసుకోనా అని అడిగాడు. ఆ సమయంలో నా కళ్లలో నీరు తిరిగాయి. కోహ్లీ డౌన్ టు ఎర్త్ మనస్తత్వంతో ఉన్నాడని తెలిపాడు. బీసీసీఐ అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #virat-kohli #cricket #gift మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి