Lovers : ఇన్ని బహుమతులు నాకు ఇచ్చిన తరువాత ఇంకా నువ్వేందుకు మావా..! ప్రేమ పేరుతో యువతి యువకుడి వద్ద నుంచి పాట్నాలో ఫ్లాట్ తీసుకుంది. తర్వాత ఐఫోన్ , ఓ లగ్జరీ కారు కూడా ప్రియుడి వద్ద నుంచి పొందింది. ఈఎంఐలతో మొత్తంగా 20 లక్షలు యువతి మీద ఖర్చు చేశాడు. అవసరం తీరాక అతని నంబర్ బ్లాక్ చేయడంతో అతను పోలీసుల్ని ఆశ్రయించాడు. By Bhavana 19 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Girl Friend Blocked Boy Friend : చదువుకునేటప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులు. ఈ స్నేహం కాస్త కాలం ముందుకు నడిచే కొద్ది ప్రేమ(Love) గా మారింది. ఇద్దరు ఒకరికొకరు బహుమతులు(Gifts) ఇచ్చుకోవడం ప్రారంభించారు. అబ్బాయి తన స్థాయికి మించి బహుమతులు ఇవ్వడం ప్రారంభించాడు. ఇదే అదనుగా భావించిన ప్రియురాలు(Lover) ఆమె విలాసాలకు అతిగా డబ్బును ఖర్చు చేయించడం మొదలు పెట్టింది. అంతేకాకుండా ఆమె డిమాండ్లు కూడా ''భారీగా'' పెరిగాయి. ఉండటానికి ఫ్లాట్, ఐ ఫోన్, లగ్జరీ కారు కావాలని అడిగింది. తన వద్ద అంత సొమ్ము లేకపోయినప్పటికీ... అప్పులు చేశాడు.. ఈఎంఐ(EMI) లు పెట్టి ఆమె అడిగినవి అన్ని కొని ఇవ్వడం ప్రారంభించాడు. అలా సుమారు రూ. 20 లక్షల వరకు ఆమె మీద ఖర్చు చేశాడు. అంతే ఇంకేముంది.. తనకు కావాల్సినవి అన్ని దొరికాయి. దాంతో ఆమె అతడి నంబర్ ను బ్లాక్(Block) చేసి పడేసింది. నీతో అవసరం తీరిపోయింది మావా.. అంటూ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఖంగుతిన్న యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎలాగైనా సరే ఆమెతో పెళ్లి చేయాలని కోరాడు. కానీ అమ్మాయి మాత్రం అతనిని కలవడానికి ససేమిరా అంటుంది. 2019 లో చదువుకునే సమయంలో ఓ పాట్నాకి చెందిన ఓ యువకుడు ముషాహరి ప్రాంతానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. తరువాత చదువు పూర్తి అయ్యింది. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ తమ ప్రేమను కొనసాగించారు. యువతి పాట్నాలోని హెల్త్ డిపార్ట్‌మెంట్(Health Department) లో కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం(Contract Based Job) చేస్తుంది. ప్రేమ పేరుతో యువతి యువకుడి వద్ద నుంచి పాట్నాలో ఫ్లాట్ తీసుకుంది. తర్వాత ఐఫోన్ , ఓ లగ్జరీ కారు కూడా ప్రియుడి వద్ద నుంచి పొందింది. ఈఎంఐలతో మొత్తంగా 20 లక్షలు యువతి మీద ఖర్చు చేశాడు. యువకుడు ఆమెతో పెళ్లి గురించి(Marriage Topic) మాట్లాడినప్పుడు, ఆమె మోహం చాటేసింది. గత 10 రోజులుగా, అమ్మాయి అతన్ని కలవడానికి, వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో పాటు ఏకంగా నంబర్ ను బ్లాక్ చేసి పాడేసింది.. అంతేకాకుండా అతడిని వదిలించుకునేందుకు బ్లాక్‌మెయిల్‌లో ఇరికిస్తానని ప్రియురాలు బెదిరించింది. దీంతో భయపడిన ప్రేమికుడు ప్రియురాలి పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాజీమహ్మద్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి యువతితో పెళ్లి చేయాలని కోరాడు. ప్రియురాలు తన తల్లి పేరుతో కారును తీసుకెళ్లిందని యువకుడు పోలీసులకు తెలిపాడు. ఇంతకుముందు చాలా బాగా మాట్లాడేది, కాంట్రాక్టు ఉద్యోగం వచ్చి పట్నం వెళ్లినప్పటి నుంచి ఆమె మాట్లాడటం తగ్గించింది. పెళ్లి విషయానికి వస్తే ఆమె దాటవేస్తుందని తెలిపాడు. విషయం వేరే పోలీస్ స్టేషన్ పరిధిలోనిది కావడంతో ఓడీ అధికారి ముషాహరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయమని చెప్పి అక్కడికి పంపించారు. Also Read : సుప్రీం తీర్పుకు ముందే ఛండీగఢ్ మేయర్ రాజీనామా! #gifts #boyfriend #girlfriend #mobile-number-blocked మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి