Giloy Face Pack: ఫేస్ ప్యాక్‌తో రష్మికలా మారిపోతారు.. ఇలా తయారు చేసుకోండి! గిలోయ్ ఒక ఆయుర్వేద మూలిక. గిలోయ్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గిలోయ్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా చేయటంతోపాటు చర్మాన్ని హైడ్రేట్ చేసి, మచ్చలను తొలగిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 09 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Giloy Face Pack: ప్రతి ఒక్కరూ ముఖాన్ని అందంగా మార్చుకోవాలని కోరుకుంటారు. ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాటి వారు గిలోయ్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా చర్మం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. గిలోయ్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేయటంతోపాటు చర్మాన్ని హైడ్రేట్ చేసి, మచ్చలను తొలగిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. గిలోయ్ మొక్కతో ఫేస్ ప్యాక్ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. గిలోయ్ మొక్క ప్రయోజనాలు: గిలోయ్ ఒక ఆయుర్వేద మూలిక. ఇది ఆరోగ్యానికి మేలుచేయటంతోపాటు చర్మానికి చాలా ఉపయోగకరంగా పని చేస్తుంది.ఒక చెంచా గిలోయ్ పౌడర్, ఒక చెంచా పెరుగు, ఒక చెంచా నిమ్మరసం కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై 15 నిమిషాలు అప్లై చేసి, ఆపై చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే ముఖంలోని మురికి తొలగిపోయి ముఖం మెరిసిపోతుంది. గిలోయ్-శెనగపిండి: ఒక చెంచా గిలోయ్ పౌడర్‌లో ఒక చెంచా శెనగపిండి, ఒక చెంచా పసుపు, రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్‌ను సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై 15 నుంచి 20 నిమిషాలు అప్లై చేసి ఆపై ముఖం కడగాలి. గిలోయ్- తేనె: ఒక చెంచా గిలోయ్ పౌడర్, ఒక చెంచా అలోవెరా జెల్, ఒక చెంచా తేనె కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై 20 నిమిషాల పాటు అప్లై చేసి, తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ముఖ్యమైన విషయంపై శ్రద్ధ: గిలోయ్‌తో చేసిన ఫేస్ ప్యాక్‌ను అప్లై చేసినప్పుడల్లా ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయాలి. ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలని గుర్తుంచుకోవాలి. మీకు ఏదైనా అలెర్జీ ఉంటే.. వెంటనే చర్మ నిపుణులను సంప్రదించండం మంచిది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: మౌత్ అల్సర్ ఇబ్బంది పెడుతుందా? ఈ హోం రెమెడీస్ పాటించండి! #giloy-face-pack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి