BIG BREAKING : ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఇప్పటికే అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుండగా రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. By srinivas 15 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP: ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు (AICC Chief Mallikarjuna Kharge) అందజేశారు. Met Shri Rahul Gandhi ji in Bharat Jodo yatra in Madhya Pradesh. pic.twitter.com/e9hiGQWQeD — Rudraraju Gidugu (@RudrarajuGidugu) December 3, 2022 హైకమాండ్ ఆదేశాలు.. ఇప్పటికే మణిపూర్లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు (YS Sharmila Reddy) ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుండగా.. మరో రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవిని గతేడాది చేపట్టిన గిడుగు రుద్రరాజు.. ఒడిశాకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. అయితే ఆయన ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ విలీనం.. ఇక వైఎస్ షర్మిల తెలంగాణలో 'వైఎస్ఆర్ టీపీ' పేరుతో పార్టీ పెట్టి పెట్టిన సంగతి తెలిసిందే. కాగా అసెంబ్లీ ఎన్నికల వేళ పోటీ నుంచి ఆమె తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి మద్ధతిచ్చారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో పలుమార్లు కాంగ్రెస్ పెద్దలను కలిసిన వైఎస్ షర్మిల.. పార్టీ విలీనం దిశగా చర్చలు జరపగా ఢిల్లీ వేదికగా ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే అవకాశం ఉంది. #resigned #gidugu-rudraraj #appc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి