Ghost Village: ఒక్క రోజులో అదృశ్యమైన గ్రామం.. దెయ్యాలే కారణమా?

జైసల్మేర్‌ కు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుల్దరా సుమారు 300 సంవత్సరాల క్రితం ఈ గ్రామం ఎంతగానో అభివృద్ది చెందిన బ్రాహ్మణ గ్రామం. ఈ గ్రామం 1291 లో ఏర్పాటు అయినట్లు సమాచారం. కానీ 1825 లో ఓ రాత్రికి రాత్రే ఒక్కరూ కూడా మిగలకుండా మాయమైపోయారు.

Ghost Village: ఒక్క రోజులో అదృశ్యమైన గ్రామం.. దెయ్యాలే కారణమా?
New Update

Ghost Village: ఆ ఊరు కూడా ఇంతకు ముందు అన్ని ఊర్లలాగానే ఎంతో బాగుండేది. ఎంతో మంది తమ కుటుంబాలతో ఆ ఊర్లో ఎంతో సంతోషంగా, ఆనందంగా గడిపారు. ఆ ఊరిని చూడటానికి పర్యాటకులు కూడా వచ్చేవారు. ఒకప్పుడు మనుషులు నివసించిన ఆ ఊర్లో ఇప్పుడు దెయ్యాలు నివసిస్తున్నాయని అంతా అంటున్నారు.

కేవలం ఒకరోజులోనే ఊరు ఊరంతా ఖాళీ చేసి ఇతర ప్రదేశాలకు తరలి వెళ్లిపోయారు. మనిషి జాడే ఊర్లో కనిపించకుండా పోయింది. ఆ గ్రామాన్ని దెయ్యాలు మింగేశాయా? లేక మరేదైనా కారణం ఉందా? అసలేం జరిగింది. ఆ ఊరి పేరు ఎత్తితేనే చుట్టు పక్కల వారు హడలి పోతున్నారు. అసలు ఆ ఊరేంటి..ఆ ఊరి వెనుక ఊన్న కథేంటి..?

జైసల్మేర్‌ కు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుల్దరా సుమారు 300 సంవత్సరాల క్రితం ఈ గ్రామం ఎంతగానో అభివృద్ది చెందిన బ్రాహ్మణ గ్రామం. ఈ గ్రామం 1291 లో ఏర్పాటు అయినట్లు సమాచారం. కానీ 1825 లో ఓ రాత్రికి రాత్రే ఒక్కరూ కూడా మిగలకుండా మాయమైపోయారు. ఈ గ్రామానికి చెందిన పూర్వీకులు తెలిపిన వివరాల ప్రకారం... సలీం సింగ్‌ అనే ఓ దుష్ట ప్రధాన మంత్రి ఆ గ్రామ పెద్ద కుమార్తెను వివాహం చేసుకుంటానని తెలిపాడు.

కానీ ఈ వివాహనికి గ్రామస్తులు ఎవరూ కూడా దానికి అంగీకారం తెలపలేదు. అంతేకాకుండా రాత్రికి రాత్రే వారంతా ఊరు విడిచి వెళ్లిపోయారు. వెళ్తూ..వెళ్తూ.. ఆ ఊరిలో ఇంకా ఎవరూ నివసించకూడదని శాపం పెట్టారు. ఆ రోజు రాత్రి తరువాత వారెవరూ కూడా కనిపించలేదు. ఆ తరువాత ఆ ఊరిలో ఎవరూ కనిపించలేదు.

కాలక్రమేణా సోషల్‌ మీడియా పుణ్యమాంటూ ఆ గ్రామం గురించి కొందరు ఔత్సహికులు తెలుసుకోని ఆ గ్రామానికి వచ్చి ఫోటోలు, వీడియోలు తీసుకోవడం మొదలుపెట్టారు. అలా వచ్చిన వారిలో కొంతమంది చీకటి పడిన తరువాత గ్రామంలో ఉండిపోవడంతో వారు దెయ్యాల్ని చూశామంటూ చెప్పడం ప్రారంభించారు.

దీంతో ఇక్కడ సందర్శించే ఎవరినీ కూడా సాయంత్రం ఆరు తరువాత గ్రామంలోకి ఎవర్ని అనుమతించారు. ఎందుకంటే ఈ గ్రామంలో రాత్రి పూట దెయ్యాలు సంచరిస్తాయనీ ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. మొత్తానికి హాంటెడ్‌ గ్రామంగా పేరుపొందిన కుల్దారా గ్రామం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Also read: మరో నెలలో పెళ్లి.. ఇంతలోనే మెడికో విద్యార్థిని ఆత్మహత్య!

#jaisalmar #kuldra #ghost-village #rajasthan #viral-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe