Street Dogs: మీ ఏరియాలో వీధి కుక్కల బెడద ఉందా?.. అయితే.. వెంటనే ఈ నంబర్ కు ఫోన్ చేయండి!

జీహెచ్ఎంసీ అధికారులు కీలక ప్రకటన చేశారు. వీధి కుక్కల బెడద ఉంటే.. టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే ఆ ఏరియాకు తమ టీంలు వచ్చి అక్కడి వీధి కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తాయని తెలిపారు.

New Update
Street Dogs: మీ ఏరియాలో వీధి కుక్కల బెడద ఉందా?.. అయితే.. వెంటనే ఈ నంబర్ కు ఫోన్ చేయండి!

ఇటీవల రాష్ట్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఏరియాలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. జవహర్ నగర్, ఇస్నాపూర్ లో వీధి కుక్కల దాడిలో చిన్నారులు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ అంశాన్ని హైకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి విచారణ నిర్వహిస్తోంది. విధి కుక్కల దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయిందని విచారణ సందర్భంగా పలు మార్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Stray Dog Attack: ​​వీధి కుక్కలు దాడి నుంచి తప్పించుకోవడానికి ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి!

వీధి కుక్కల బెడద ఉంటే తమకు ఫోన్ చేయాలని టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించారు. మీ ఏరియాలో వీధి కుక్కల బెడద అధికంగా ఉంటే.. టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే జీహెచ్ఎంసీ డాగ్ క్యాచింగ్ టీంలు వచ్చి ఆ ఏరియాలోని శునకాలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తాయని తెలిపారు. ఒక్క కాల్ తో వీధి కుక్కల సమస్యకు పరిష్కారం లభిస్తుందని జీహెచ్ఎంసీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Street Dogs in Hyd: వీధి కుక్కల దాడులు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్



Advertisment
Advertisment
తాజా కథనాలు