తెలంగాణలో.. ఇందులో ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఇటీవల వీధి కుక్కల దాడులు అధికమయ్యాయి. ఇస్నాపూర్ లో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి ఘటన మరవక ముందే.. జవహర్ నగర్ లో మరో చిన్నారి వీధి కుక్కల దాడికి బలయ్యాడు. రాష్ట్రంలో ప్రతీ రోజు సగటున 70 మంది కుక్కకాటుకు గురవుతున్నారు. ఏడు నెలల్లో 15 మంది వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా సంస్థల లెక్కలు చెబుతున్నాయి. నిత్యం వీధి కుక్కల దాడులకు సంబంధించి వార్తలు వస్తుండడంతో హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Street Dogs in Hyd: వీధి కుక్కల దాడులు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
వివిధ ప్రాంతాల్లో వీధి కుక్కల వరుస దాడులపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
Translate this News: