Health Tips: వీరు నెయ్యిని అస్సలు తినకూడదు.. లేదంటే సమస్యలు తప్పవు..!

నెయ్యి తినడం వలన ప్రయోజనాలతో పాటు.. చెడు కూడా జరిగే అవకావశం ఉంది. చాలా మంది నెయ్యిని అన్నం, చపాతీ, ఇతర ఆహారాలతో కలిపి తింటారు. కానీ, నెయ్యి అందరికీ క్షేమం కాదు. అధిక కొవ్వు ఉన్నవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు నెయ్యి తినొద్దు.

New Update
Health Tips: వీరు నెయ్యిని అస్సలు తినకూడదు.. లేదంటే సమస్యలు తప్పవు..!

Ghee Side Effects: శుద్ధమైన నెయ్యితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే.. శతాబ్ధాల తరబడి నెయ్యిని ఆహారంలో వినియోగిస్తూ వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నెయ్యిలో ఆయుర్వేద లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని వీనియోగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే, నెయ్యి అధిక వినియోగం ఆరోగ్యానికి హానీకరం కూడా. కొందరికి ఔషధంలా పని చేసే నెయ్యి.. మరికొందరికి మాత్రం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. మరి ఈ నెయ్యిని ఎవరు తింటే ప్రమాదమో ఓసారి తెలుసుకుందాం..

ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీన్ని రోజూ తినడం వల్ల అనేక రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. దేశీ నెయ్యి జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉండటమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే నెయ్యి కొందరికి చాలా ప్రమాదకరం. ముఖ్యంగా పలు వ్యాధులతో బాధపడేవారికి నెయ్యి చాలా ప్రమాదకరమని అనేక నివేదికలు చెబుతున్నాయి.

నెయ్యి ఎవరు తినొద్దంటే..

కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు: నెయ్యిలో చాలా సంతృప్త కొవ్వు ఉంటుంది. దీన్ని ఎక్కువగా తింటే చెడు కొలెస్ట్రాల్‌ గణనీయంగా పెరుగుతుంది. నెయ్యి ఎక్కువగా తినడం వల్ల సిరల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అదే జరిగితే రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఉదర సంబంధిత సమస్యలు: ఉదర సంబంధిత సమస్యలు, వ్యాధులు ఉన్నవారు నెయ్యి తినకూడదు. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. అజీర్తీ, గ్యాస్, కడుపు ఉబ్బరంగా ఉంటే.. నెయ్యిని అస్సలు తినకూడదు.

జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు: ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేదం ప్రకారం.. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఉన్నవారు నెయ్యి తినకూడదు. నెయ్యి తింటే కఫం పెరుగుతుంది. జ్వరం కూడా పెరుగుతుంది.

గర్భిణీ స్త్రీలు: గర్భిణీ స్త్రీలు నెయ్యి తినాలి. కానీ గర్భిణీ స్త్రీలు నెయ్యి ఎక్కువగా తింటే కాలేయ సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇది స్త్రీ, బిడ్డ ఇద్దరికీ హానికరం.

కాలేయ వ్యాధులు ఉన్నవారు: కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులు నెయ్యి తినకూడదు. ఇది ఫ్యాటీ యాసిడ్ సమస్య పెరుగుదలకు కారణం అవుతుంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని RTV ధృవీకించడం లేదు.

Also Read:

సీఎం ఫైనల్‌ రేసులో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌.. హైకమాండ్ ఎవరి వైపు?

Advertisment
తాజా కథనాలు