Furniture: ఫర్నిచర్‌లో చెదపురుగులు ఉన్నాయా..? ఈ ట్రిక్‌తో దాన్ని వదిలించుకోండి ఫర్నీచర్ చెదలు పట్టిందా..? చెదపురుగులను వెంటనే వదిలించుకోవడానికి కొన్ని సులభమైన ఉపయోగాలున్నాయి. చెదపురుగులు తడి, చీకటి ప్రదేశాలలో నివసించడానికి ఇష్టపడతాయి. ఫర్నిచర్‌ను సూర్యకాంతిలో ఉంచడం, వేప నూనె, వెనిగర్- నిమ్మరసం, ఆరెంజ్ ఆయిల్‌తో త్వరగా ఉపశమనం పొందవచ్చు. By Vijaya Nimma 30 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Furniture: ఫర్నీచర్ వస్తువులు ఇంటి అందాన్ని పెంచుతాయి. ప్రతీ ఇంట్లో ఫర్నీచర్ వస్తువులు ఉంటాయి. అయితే.. వస్తువుల్లో చెదపురుగుల సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. చెదపురుగులు ఎక్కువగా అలమారాలు, తలుపులు, కిటికీలు, ఫర్నిచర్, బల్లలు వంటి చెక్క వస్తువులను పాడు చేస్తాయి. ఒకసారి దాడి చేస్తే అవి లోపలి నుంచి చెక్కను నశనం చేస్తాయి. చెదపురుగులకు సకాలంలో బయటకు పంపకపోతే, అవి మళ్లీ మళ్లీ వచ్చిమీ చెక్క వస్తువులను పాడు చేస్తాయి. దీంతో మీ వస్తువులను విసిరేయవలసి ఉంటుంది. ఫర్నీచర్‌లోని చెదపురుగు సమస్య తగ్గాలంటే ఇంట్లో కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. వేప నూనె: చెదపురుగులకు వ్యతిరేకంగా వేపనూనె చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో చెదపురుగులను చంపే సహజమైన అంశాలు ఉంటాయి. స్ప్రే బాటిల్‌లో వేపనూనె నింపి చెదపురుగు సోకిన ప్రదేశంలో చల్లాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే చెదపురుగులు పూర్తిగా తొలగిపోతాయి. ఈ సులభమైన పద్ధతితో చెదపురుగులను వదిలించుకోవచ్చు. వెనిగర్- నిమ్మరసం: వెనిగర్- నిమ్మరసం కలిపి స్ప్రేలా చేసుకోవాలి. ఇది చెదపురుగులను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. ఈ పుల్లని మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి తర్వాత చెదపురుగు సోకిన ప్రదేశాల్లో చల్లాలి. ఇందులో ఉండే ఆమ్ల గుణం చెదపురుగులను తొలగించడంలో సహాయపడుతుంది. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల చెదపురుగుల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఆరెంజ్ ఆయిల్: ఆరెంజ్ ఆయిల్‌లో డి-లిమోనెన్ అనే ప్రత్యేక మూలకం ఉంటుంది. ఈ మూలకం చెదపురుగులకు చాలా హానికరం. ఈ నూనెను చెదపురుగు సోకిన దగ్గర రాస్తే, చెదపురుగులు చనిపోతాయి. దీన్ని ఉపయోగించడం ద్వారా సులభంగా, త్వరగా చెదపురుగుల సమస్యను వదిలించుకోవచ్చు. సూర్యకాంతి చెదపురుగులు తడి, చీకటి ప్రదేశాలలో నివసించడానికి ఇష్టపడతాయి. అందువల్ల.. ఫర్నిచర్‌కు చెదపురుగులు ఉంటే దానిని సూర్యకాంతిలో ఉంచాలి. ఫర్నీచర్‌ను సూర్యరశ్మిలో ఉంచడం వల్ల ఫర్నిచర్‌లోని తేమ శాతం తగ్గుతుంది. చెదపురుగులు వాటంతట అవే చనిపోతాయి. చెదపురుగులను వదిలించుకోవడానికి ఇది సులభమైన, సహజమైన మార్గం. ఇది కూడా చదవండి: మృదువైన ముఖచర్మం కోసం టీ లీవ్స్ వాడండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #furniture మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి