Cleaning Tips: ఉదయం లేవగానే టీ, కాఫీ తాగే అలవాటు అందరికి ఉంటుంది. కొందరైతే ఉదయమే కాదు మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కూడా టీ, కాఫీలను ఇష్టంగా తాగుతారు.బట్టలపై టీ మరకలను తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలన్నాయి. వాటి సహాయంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు బట్టలు మెరిసేలా చేయవచ్చు. ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు హోమ్ మేకర్స్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఫర్నీచర్, కిచెన్, దుస్తుల విషయంలో ఎక్కవ జాగ్రత్తగా తీసుకుంటారు. ఏదైనా మరకలు అంటినప్పుడు తొలగించేందుకు సింపుల్ చిట్కాల కోసం సెర్చ్ చేస్తారు. ఈ సమయంలో ఎలాంటి సమయం, డబ్బు, శ్రమ వృధా కాకుండా.. దుస్తులపై టీ మరకలను ఎలా తొలగించాలో సూచిస్తున్నారు. ఇందుకోసం కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.
నిమ్మకాయతో టిప్స్
➡తాజాగా ఉన్న ఓ నిమ్మకాయను కట్ చేసి.. ఆ రసాన్ని మరకపై పిండాలి.
➡కొద్ది సమయం తరువాత ఆ ప్రాంతాన్ని పాత టూత్ బ్రష్‌తో సున్నితంగా రుద్దాలి.
➡తరువాత నేచురల్ బ్లీచింగ్ ఎఫెక్ట్ కోసం ఎండలో కొద్దిసేపు ఉంచాలి.
➡గంట తరువాత ఆ దుస్తులను యథావిధిగా ఉతకాలి.
➡ఇలా చేస్తే టీ మరక తొలగిపోతాయి.
వెనిగర్‌తో టిప్స్
➡ముందుగా వైట్ వెనిగర్, నీటిని సమాన భాగాలుగా కలుపుకోవాలి.
➡టీ మరకలు ఉన్న దగ్గర ఈ ద్రావణాన్ని కొద్దికొద్దిగా అప్లయ్ చేయాలి.
➡30 నిమిషాల వరకు దానిని అలాగే వదిలేయాలి.
➡అనంతరం ఆ ప్రాంతాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయాలి.
➡తర్వాత ఆ దుస్తులను వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే మరకలు పోతాయి.
బంగాళాదుంప టిప్స్
➡బట్టలపై టీ మరకలను శుభ్రం చేయడానికి బంగాళాదుంపలను బెస్ట్
➡బంగాళాదుంపలను నీటిలో మరిగే వరకు ఉడకబెట్టాలి.
➡ఉడికించిన బంగాళాదుంప నీటిలో టీ మరకలు దగ్గర బట్టలు వేసి కొద్దిసేపు నానా బెట్టాలి
➡ 30 నిమిషాల తరువాత ఆ బట్టలు తీసి శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకోవాలి. ఇలా చేస్తే టీ మరకలు పోతాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.