General Elections 2024: బీజేపీదే మళ్ళీ అధికారం.. ఇండియా కూటమి ప్రభావం ఉండదు.. రవి ప్రకాష్ తో ప్రశాంత్ కిషోర్!

దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రముఖ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అభిప్రాయ పడ్డారు. ఆర్టీవీ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన జాతీయ రాజకీయాలపై పలు అంశాలను రవిప్రకాష్ తో పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ ఇక్కడ వీడియోలో చూడొచ్చు

General Elections 2024: బీజేపీదే మళ్ళీ అధికారం.. ఇండియా కూటమి ప్రభావం ఉండదు.. రవి ప్రకాష్ తో ప్రశాంత్ కిషోర్!
New Update

Prashant Kishor Exclusive Interview: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మరి కొద్ధి గంటల్లో నాలుగో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో ప్రముఖ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల సరళిని బట్టి దేశ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు? ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ తరువాత ఇండియా కూటమి విజయావకాశాలు ఎలా ఉండవచ్చు? ఇటువంటి జాతీయ అంశాలపై ఆర్టీవీ స్టూడియోలో రవిప్రకాష్ తో ముచ్చటించారు. ప్రస్తుత ఎన్నికల తరుణంలో జాతీయ రాజకీయ పరిస్థితులపై ప్రశాంత్ కిషోర్ ఆర్టీవీ తో పంచుకున్న అభిప్రాయం ప్రకారం జాతీయస్థాయిలో మళ్ళీ బీజేపీ అధికారం సాధిస్తుంది. ఇండియా కూటమి అనుకున్న స్థాయిలో ఎన్డీయే కూటమికి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. 

ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ గెలిస్తే రిజర్వేషన్స్ రద్దయిపోతాయి అంటూ ఇండియా కూటమి ప్రచారం చేయడంపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. “ఇది ఎన్నికల సమయం.. పార్టీల మధ్యలో ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి. కాంగ్రెస్ వస్తే ఎదో జరిగిపోతుంది అని బీజేపీ ప్రచారం చేస్తుంది. ఇవన్నీ అబద్ధాలే. ఈ విషయం ఆ మాట్లాడేవారికి తెలుసు. వింటున్న మనకీ తెలుసు.” అంటూ ఆయన ప్రచారంలో వచ్చే మాటలను కొట్టిపాడేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు నుంచి విడుదల కావడం ఎన్నికల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని రవిప్రకాష్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. సహజంగానే తమ నాయకుడు జైలు నుంచి బయటకు వచ్చారు అంటే, ఆ పార్టీ కార్యకర్తలకు కొంత జోష్ వస్తుంది. 

publive-image

కానీ, ఆప్ ప్రభావం ఎన్నికలపై ఎంత ఉంటుంది? అని అంటే పెద్దగా ఉండదు అని చెప్పవచ్చు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆప్ ఢిల్లీలో 7, పంజాబ్ లో 14, గుజరాత్ లో 1 స్థానంలో పోటీ చేస్తోంది. ఢిల్లీ, గుజరాత్ లో మాత్రమే ఆప్ పార్టీకి-బీజేపీకి మధ్యపోటీ ఉంటుంది. అవి 8 సీట్లు. వాటిలో గెలుపు ఓటముల పరిస్థితి బీజేపీని ప్రభావితం చేయదు. అదేవిధంగా పంజాబ్ లో పోటీ కాంగ్రెస్-ఆప్ మధ్య ఉంటుంది. అక్కడ ఆప్ వలన కాంగ్రెస్ ప్రభావితం అవుతుంది ఎందుకంటే, అక్కడ రెండు పార్టీల మధ్య అలయన్స్ లేదు అంటూ చెప్పారు. ఇక కేజ్రీవాల్ మోదీ 75 ఏళ్ల తరువాత ప్రధానిగా ఉండరు.. అంటూ చేస్తున్న ప్రచారంపై కూడా ప్రశాంత్ కిషోర్ స్పష్టత ఇచ్చారు. “బీజేపీ రాజ్యంగంలో ఆ నిబంధన లేదు. 2014లో మోదీ తీసుకువచ్చిన రూల్ ఇది. రూల్ తెచ్చిన వారు రూల్ మార్చడం కష్టమేమీ కాదు కదా. ఇదంతా వాళ్ళిష్టం. ఇది ఓటర్లపై ప్రభావం చూపిస్తుంది అని నేననుకోను.” అంటూ వివరించారు. 

publive-image

మొత్తంగా ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం ప్రకారం దేశంలో మోదీ తిరిగి ప్రధాని కాబోతున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభావం ఉండదు అని అర్ధం అవుతోంది. ప్రశాంత్ కిషోర్ తో రవి ప్రకాష్ పూర్తి ఇంటర్వ్యూ ఈ కింది వీడియోలో చూడొచ్చు. 

Also Read: ఈసారి జగన్ కు 51 సీట్లు కూడా రావు.. ప్రశాంత్ కిషోర్

#ravi-prakash #lok-sabha-elections-2024 #prashant-kishore
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe