PM Modi Hattrick: 56 అంగుళాల ఛాతి వీరుడు.. ఛాయ్‌వాలా టు హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు!

నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నిక కానున్నారు. 2024లోనూ మోదీ గెలుపును కాంగ్రెస్‌ ఆపలేకపోయింది. అసలు మోదీ ప్రభంజనానికి కారణాలేంటి? మోదీకి ప్లస్‌లు ఏంటి? ఆయనపై ఉన్న విమర్శలేంటి లాంటి విషయాల కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

PM Modi Hattrick: 56 అంగుళాల ఛాతి వీరుడు.. ఛాయ్‌వాలా టు హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు!
New Update

Narendra Modi Hattrick PM: అది 2001, జనవరి 26.. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ సంబరాల్లో మునిగిపోయింది.. అటు గుజరాత్‌లోని భుజ్‌ ప్రాంతం మాత్రం మరుభూమిగా మారింది. నిమిషాల వ్యవధిలో భవనాలు కుప్పకూలిపోయాయి.. 30వేల మంది శిధిలిల కింద చిక్కుకోని చనిపోయారు.. ఈ సమయంలో ప్రజలకు అండగా నిలపడి, ధైర్యాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వం సహాయక కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడిందన్న విమర్శలు వచ్చాయి..అందరూ ఓ నాయకుడు కోసం ఎదురుచూశారు. సరిగ్గా అదే సమయంలో నరేంద్ర మోదీ పేరును ఎల్‌కే అద్వాని తెరపైకి తీసుకొచ్చారు.. సీన్‌ కట్‌ చేస్తే.. 2024 జూన్‌.. నాడు గుజరాత్‌ సీఎంగా రాజకీయల్లో పెను సంచలనాలకు కారణమైన మోదీ నేడు విశ్వగురువుగా మూడో సారి ప్రధాని పదవిలో కూర్చున్నారు!

56 అంగుళాల ఛాతీ:
'ఇంకో గుజరాత్‌ను రూపొందించాలంటే 56 అంగుళాల ఛాతీ ఉండాలి...' ఇది 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ చేసిన కామెంట్‌. తన గురించి చెప్పుకుంటూ ములాయం సింగ్ యాదవ్‌కు కౌంటర్‌గా మోదీ మాట్లాడిన ఈ సెంటెన్స్‌ ఆయనకు అప్పటికే ఉన్న మాస్‌ ఫాలోయింగ్‌ను అమాంతం పెంచింది. ఇలా మోదీ ఏం మాట్లాడినా ఏం చేసినా జనాలు ఇట్టే అట్రాక్ట్ అయ్యేవారు. మోదీ ఎక్కడ ఏ సభ పెట్టినా ఆయన్ను చూడటానికి ప్రజలు భారీగా తరలివచ్చేవారు. 2004లో అధికారం కోల్పోయిన బీజేపీ.. 2014, 2019, 2024లో హ్యాట్రిక్‌ విజయాలు సాధించిందంటే దాని వెనుక ఉన్న ఒకే ఒక్కడు మోదీ!

మలుపు తిప్పిన 1975:
1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లా-వాద్‌నగర్‌లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు మోదీ. వాద్‌నగర్‌లోనే స్కూల్‌ ఎడ్యూకేషన్‌ పూర్తి చేసుకున్న మోదీ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిస్టెస్స్ ఎడ్యూకేషన్ ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పొందారు. గుజరాత్ యూనివర్సిటీ నుంచి అదే రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు హిందూత్వ సిద్దాంతాలకు ఆకర్షితులైన మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ సభలు, సమావేశాల్లో యాక్టివ్‌గా పాల్గొనేవారు. ఇది సంఘ్‌ పరివార్‌కు ఆయన్ను దగ్గర చేసింది. 1975లో గుజరాత్‌లో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలను తీసుకున్న మోదీ దాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. దీంతో ఆయన జీవితం కొత్త మలుపులు తీసుకుంది.

భూకంపం మార్చిన రాజకీయ జీవితం:
ఆ తర్వాత గుజరాత్‌ ఏబీవీపీ లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మోదీ హిందూత్వ ఐడియాలజీని యువతలోకి స్ప్రెడ్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఇక 1986లో బీజేపీలో చేరారు మోదీ. క్రమక్రమంగా బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. 1995లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి మోడీ ఎంతగానో కృషి చేశారు. ఆయన కష్టాన్ని గుర్తించిన పార్టీ పెద్దలు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇంఛార్జిగా నియమించింది. అక్కడ కూడా మోదీ సక్సెస్ అయ్యారు.. ఇక ఆ తర్వాత 2001లో గుజరాత్‌లో భూకంపం రావడం.. సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమవడం.. మోదీని స్వయంగా అద్వానీ సీఎంగా నిలబెట్టి గెలిపించడం చకాచకా జరిగిపోయాయి.

గుజరాత్‌ మోడల్‌తో ఫేమస్:
గుజరాత్‌ సీఎంగా ఎన్నికైన మోదీ ఆ తర్వాత కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి. హిందూ, ముస్లిం అల్లర్లలో 2 వేల మందికి పైగా చనిపోయారు. ఈ గొడవలను అదుపు చేయడంతో మోదీ విఫలమయ్యారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వెంటనే జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ విజయఢంకా మోగించారు. అల్లర్లతో అప్పటికే అప్రతిష్ట మూటగట్టుకున్న గుజరాత్‌ను అభివృద్ధివైపు మోదీ నడిపించారని చెబుతారు విశ్లేషకులు. అలా 'గుజరాత్‌ మోడల్‌' అనే పదాన్ని మోదీ ప్రమోట్ చేసుకున్నారు.. ఇదే 2014లో మోదీని పీఎం అభ్యర్థిగా నిలబెట్టడంతో పాటు గెలిపించడంలో కీ రోల్ ప్లే చేసింది.

రామమందిరంతో హిందూ సమాజంలో మరింత క్రేజ్:
2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అందులో పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, జీఎస్టీ లాంటివి కీలకమైనవిగా చెప్పాలి. ఇటు బీజేపీ చిరకాల స్వప్నం రామమందిరం నిర్మాణం కూడా మోదీ ప్రధానిగా ఉండగానే ప్రారంభోత్సవం జరిగింది. దీంతో ఆయనకు క్రేజ్‌ మరింత పెరిగిపోయింది.. అటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లాంటి పథకాలతో పెద, మద్యతరగతి ప్రజలకు దగ్గరయ్యారు మోదీ.. ఇదే ఆయన్ను మూడోసారి కూడా ప్రధాని అవ్వడానికి కారణమైంది..

వివాదాస్పదుడు:
మరోవైపు ప్రధానిగా మోదీ సమయంలో రాజ్యాంగ సంస్థలు దుర్వినియోగం అయ్యాయన్న విమర్శలూ ఉన్నాయి. ముఖ్యంగా ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు ఉపయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. 2014 తర్వాత 95శాతం ఈడీ దాడుల్లో బీజేపీయేతర పార్టీల వారే ఉన్నానని 'ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' రిపోర్ట్ చెబుతోంది. అటు హిందూ మత భావజాలం మోదీ ప్రభుత్వ హయంలో విపరీతంగా వ్యాప్తి చెందిందని పలు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు చెబుతున్నాయి.. అయితే ఇవేవీ కూడా మోదీ గెలుపును ఆపలేకపోయాయి!

Also Read: Election Results: ఓటరన్న షాక్ మామూలుగా లేదు.. దేశమంతా రిజల్ట్స్ తారుమారు!

#narendra-modi #general-elections-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe