General Elections 2024 Schedule: దేశంలో ఎన్నికల సంబరానికి తెరలేచింది. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం(ECI) ప్రకటించింది. దీంతో పాటు సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఈసీ అనౌన్స్ చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్‌ని విడుదల చేసింది.
➡ మార్చి 20న లోక్ సభ ఎలక్షన్ నోటిఫికేషన్
➡ జూన్ 4న కౌంటింగ్
➡ ఫేజ్ 1- ఏప్రిల్ 19
➡ ఫేజ్ 2- ఏప్రిల్ 26
➡ ఫేజ్ 3 - మే 7
➡ ఫేజ్ 4-మే 13
➡ ఫేజ్ 5- మే 20
➡ ఫేజ్ 6- మే 25
➡ ఫేజ్ 7- జూన్ 1
➡ ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్ ప్లీనరీ హాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం(ECI) ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ (Rajiv Kumar).. కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధులతో కలిసి 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు.
➡ ఎన్నికల విధుల్లో 1.5 కోట్లమంది పాల్గొంటారు- సీఈసీ
➡ జూన్ 16లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది- సీఈసీ రాజీవ్ కుమార్
➡ దివ్యాంగులకు ఓట్ ఫ్రమ్ హోం ఆప్షన్- రాజీవ్‌కుమార్
➡ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఓటర్లలో జాతీయ లింగ నిష్పత్తి 948గా ఉందని ప్రకటించారు. అదనంగా, 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
➡ బ్యాంక్ లావాదేవీలపై నిఘా ఉంటుంది- సీఈసీ
➡ సోషల్‌మీడియాలో ఫేక్ న్యూస్‌పై వెంటనే ఫ్యాక్ట్ చెక్ చేస్తాం- సీఈసీ
➡ పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు ప్రత్యేక డ్రోన్లు-సీఈసీ రాజీవ్‌కుమార్
➡ ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలు అసలు ఉండకూడదు- సీఈసీ రాజీవ్‌కుమార్
➡ ఎన్నికల తేదీల ప్రకటన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. అంటే ఈ రోజు(మార్చి 16) నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఇది ఫలితాలు వెలువడే వరకు అమలులో ఉంటుంది. ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ, నాయకులు ప్రవర్తనా నియమావళిని పాటించడం తప్పనిసరి. ఏ పార్టీ కూడా ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు కూడా చేయడానికి వీల్లేదు. ఒకవేళ పరిస్థితి అత్యవసరమైతే ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగియనుంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్, ఆప్, టీఎంసీ సహా ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ఫుల్‌గా ప్రిపేర్ అవుతున్నాయి. సంబంధిత పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నాయి.
➡ దేశవ్యాప్తంగా సుమారు 96.6 కోట్ల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 49.7 పురుష ఓటర్లు, 47.1 మహిళా ఓటర్లు ఉన్నారు.
➡ 543 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు సంబంధించి బీజేపీ ఇప్పటివరకు 267 మంది అభ్యర్థులతో రెండు జాబితాలను విడుదల చేయగా, కాంగ్రెస్ రెండు జాబితాల్లో 82 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీఎంసీ బెంగాల్, అసోంలలో పోటీచేసే 47 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
➡ ఇటు ఏపీలో వైసీపీ ఫుల్ లిస్ట్‌ను ఇప్పటికే ప్రకటించింది. ఇక నిన్న ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సంధు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
➡ నిజానికి లోక్‌సభలో 545 ఎంపీ సీట్ల ఉంటాయి. ఇందులో 543 మందిని ప్రజలు ఎన్నుకుంటారు. మిగిలిన ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
➡ 55 EVMలు సిద్ధం చేశాం- సీఈసీ
➡ చివరిసారిగా 2019 ఏప్రిల్ 11 -మే 19 మధ్య దేశవ్యాప్తంగా 7 దశల్లో ఓటింగ్ జరిగింది. మే 23, 2019న ఫలితాలు ప్రకటించారు. నాడు బీజేపీ 303 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ సోలోగానే మెజారిటీ మార్క్‌ను అధిగమించింది. ఇక తన మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
➡ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 52 సీట్లు వచ్చాయి. మరి ఈసారి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. మరోసారి ప్రజలు బీజేపీకే పట్టం కడతారా లేదా మార్పును కోరుకుంటారా అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే!
➡ లోక్‌సభ ఎన్నికలను భారత ఎన్నికల సంఘం (ECI) నిర్వహిస్తుంది. ఇది స్వయంప్రతిపత్త రాజ్యాంగ అధికారం. నిష్పక్షపాత ఎన్నికలను నిర్ధారించడానికి మొత్తం ప్రక్రియను ECI పర్యవేక్షిస్తుంది.
Also Read: వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల లిస్ట్ ఇదే.. ఎవరెవరున్నారంటే?